అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Iran Dubai Doha Attacks | ఇజ్రాయెల్ (Israel), అమెరికా దాడులతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశ ఐఆర్జీసీ తీవ్రంగా ప్రతి స్పందించింది. ఖమేనీ మృతిపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున గల్ఫ్ ప్రాంతంలోని ముఖ్య నగరాలపై ఉద్రిక్తతలు మరింత పెచ్చరిల్లాయి. అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. దీంతో దుబాయ్, దోహాలో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
Iran Dubai Doha Attacks | దుబాయ్, దోహాలలో భారీ పేలుళ్లు
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ (Dubai), ఖతార్‌లోని దోహా, బహ్రెయిన్‌లోని మనామా నగరాల్లో పేలుళ్లు సంభవించాయి. ఈ మూడు దేశాల్లో కూడా అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. వీటిని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
Iran Dubai Doha Attacks | దుబాయ్‌లో పలుచోట్ల భారీ శబ్దాలు
దుబాయ్‌లో ఆదివారం ఉదయం సమయంలో కనీసం మూడు భారీ శబ్దాలు వినిపించినట్లు సమాచారం. అంతేకాకుండా కొద్ది నిమిషాల తర్వాత మరిన్ని పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. దాడులు ఎక్కడెక్కడ పడ్డాయనేది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. కాగా.. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు ఆధారాలు లేవు. బుర్జ్ ఖలీఫా సమీపంలో పేలుడు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Iran Dubai Doha Attacks | అబుధాబి, ఇతర గల్ఫ్ ప్రాంతాలపై దాడులు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబిపై శనివారం దాడులు జరిగిన విషయం తెలిసిందే. గల్ఫ్ దేశాల్లోని అనేక సైనిక స్థావరాలు, పౌర స్థలాలపై కూడా ఇరాన్ దాడులు జరిగాయి. కాగా.. మధ్యవర్తి దేశమైన ఒమాన్‌లో మాత్రమే దాడులు జరగడం లేదు.
దుబాయ్ విమానాశ్రయంలో ఖాళీ
దుబాయ్ విమానాశ్రయం నుంచి ప్రజలు భయపడి పరుగులు పెడుతున్నట్లు వీడియోలు నెటింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో పొగతో నిండిపోగా ప్రజలు పరుగులు పెడుతున్నారు. అయితే అధికారులు విమానాశ్రయాన్ని ఖాళీ చేయడానికి కారణం వెల్లడించలేదు. విమానయాన వర్గాలు ‘రాయిటర్స్’తో మాట్లాడుతూ రాత్రి వేళ ఇరాన్ దాడి వల్ల ఒక టెర్మినల్‌కు హాని కలిగిందని చెప్పినట్లు సమాచారం.
ఖతార్, బహ్రెయిన్‌లో మిసైల్, డ్రోన్ దాడులు
ఖతార్ రాజధాని దోహాపైకి శనివారం మిసైల్స్ రాగా ఇంటర్సెప్ట్ చేశారు. బహ్రెయిన్‌లో బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్ దాడి జరిగడంతో కొంత నష్టం కలిగినట్లు సమాచారం. అయితే ఎలాంటి ప్రాణనష్టం లేదని, స్థలాన్ని సురక్షితం చేస్తున్నామని అక్కడి మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
గల్ఫ్ ఎయిర్ స్పేస్ మూసివేత
మధ్యప్రాచర్యంలో ఉద్రిక్తతలు పెరగడంతో ఎయిర్ స్పేస్‌ను మూసివేశారు. దుబాయ్, అబు ధాబి వైపు వెళ్లే విమానాలు శనివారం నుంచి సస్పెండ్ చేయబడ్డాయి. అలాగే ఫ్లైట్ ట్రాకింగ్‌కు సంబంధించిన మ్యాప్‌ల్లో సైతం ఈ ప్రాంతం ఖాళీగా కనిపించింది. అనేక విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి.
కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్ దాడి
కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్-1పై కూడా శనివారం దాడి జరిగింది. దీంతో పలువురు ఉద్యోగులు స్వల్పంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. కువైట్ సివిల్ ఏవియేషన్ అధికారులు అత్యవసర చర్యలు చేపట్టి పరిస్థితిని నియంత్రణలోకి తీసుకువచ్చారు.
ఇది కూడా చదవండి : Iran US Conflict | ఇరాన్‌పై యూఎస్ దాడులు.. ఆందోళనలో భారత్.. ఎందుకంటే?

