అక్షరటుడే, వెబ్‌డెస్క్: Iran India Gas Support | మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు ఇరాన్ కీలక మద్దతు ప్రకటించింది. ఇంధన సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో భారత నౌకలకు సురక్షిత మార్గాన్ని కల్పిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది.
ఈ నిర్ణయం భారత్ (India) కు ఇంధన సరఫరా వ్యవస్థలో విశ్వాసాన్ని కలిగించే అంశంగా భావిస్తున్నారు. ఇందులో భాగంగా భారత్‌కు చెందిన ఒక ఎల్‌పీజీ ట్యాంకర్ శనివారం ఎలాంటి అడ్డంకులు లేకుండా హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)ను సురక్షితంగా దాటింది. మరో ట్యాంకర్ కూడా త్వరలోనే భారత్‌కు బయలుదేరనున్నట్లు సమాచారం. ఈ పరిణామం మధ్యప్రాచ్య ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య భారత్‌కు కొంత ఊరటను కలిగించింది.
Iran India Gas Support | భారత నౌకలకి రక్షణ…
భారత్‌తో ఉన్న సుదీర్ఘ మైత్రి సంబంధాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ (Iranian Ambassador Mohammad Fathali) తెలిపారు. భారత్‌ను మిత్రదేశంగా భావిస్తున్నామని, భారతీయుల కష్టాలను తమ కష్టాలుగా భావిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాలకు ఉమ్మడి ప్రయోజనాలు, భవిష్యత్తు ఉన్నందునే భారత నౌకలకు రక్షణ కల్పిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో ఇటీవల పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలి ఖమేనీ (Iran’s Supreme Leader Ali Khamenei) మరణించిన తర్వాత ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగి యుద్ధ వాతావరణం నెలకొన్నట్లు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి.
Iran India Gas Support | గ్యాస్ పంపిణీకి కొత్త మార్గదర్శకాలు
ఇటీవల ఖతార్‌లోని గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ దాడులు జరిపినట్లు వార్తలు రావడంతో అక్కడి నుంచి గ్యాస్ సరఫరా తాత్కాలికంగా నిలిచిపోయింది. దీంతో దేశంలో ఎల్‌పీజీ సిలిండర్ల (LPG Cylinders) కోసం ప్రజలు భారీగా బుకింగ్స్ చేయడం ప్రారంభించడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పంపిణీకి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తిని 28 శాతం వరకు పెంచే చర్యలు కూడా తీసుకుంది. అయితే భారత్‌కు ఇంధన సరఫరాలో ఎలాంటి సమస్యలు ఎదురుకావని కేంద్ర ప్రభుత్వం (Central Government) స్పష్టం చేసింది. భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో 70 శాతానికి పైగా ఇతర మార్గాల ద్వారా వస్తుండటంతో సరఫరాకు ఎలాంటి డోకా లేదని అధికారులు తెలిపారు. ప్రపంచంలోనే భారత్ నాలుగో అతిపెద్ద రిఫైనింగ్ సామర్థ్యం కలిగిన దేశమని, ఇంధన లభ్యతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Iran Israel War live updates | ఇరాన్ అధ్యక్షుడికి భారత్ ప్రధాని ఫోన్.. యుద్ధం మొదలయ్యాక తొలిసారి పలకరింపు!

