అక్షరటుడే, వెబ్‌డెస్క్: Iran Israel Conflict | పశ్చిమాసియమా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా లెబనాన్ సైతం రంగంలోకి దిగింది.
ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం ఆరో రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్, అమెరికా దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్, జోర్డాన్, కుర్దిస్తాన్ భూభాగాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో టెహ్రాన్ దాడులు చేసింది. మరోవైపు టెల్ అవీవ్ సైతం ప్రతిదాడులు చేస్తోంది. గురువారం ఉదయం టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ మరో భారీ దాడి చేసింది. సైనిక స్థావరాలు, IRGC కమాండ్ సెంటర్‌లే లక్ష్యంగా క్షిపణులు ప్రయోగించింది.
Iran Israel Conflict | విమానం కూల్చివేత
ఇరాన్ భూభాగంపై సుమారు 1600 సార్లు విమానాలతో ఐడీఎఫ్ దాడులు చేసింది. ఇరాన్ గగనతలంలో YAK-130 జెట్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన F-35 యుద్ధ విమానం కూల్చి వేసింది. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు 4 వేలకు పైగా బాంబులను ప్రయోగించగా.. ఇరాన్ 500 బాలిస్టిక్ క్షిపణులు, 2 వేల డ్రోన్లను ప్రయోగించింది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఖతార్ తమ ఎయిర్ స్పేస్‌ను మూసి వేసింది. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు దోహాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.
Iran Israel Conflict | యుద్ధనౌకపై దాడి
ఇరాన్ యుద్ధ నౌక(Iranian warship)పై అమెరికా సబ్ మెరైన్ దాడి చేసిన విషయం తెలిసిందే. శ్రీలంక (Sri Lanka) దక్షిణ తీరం నుంచి వెళుతున్న ఇరాన్ యుద్ధపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 87 మృతదేహాలు లభ్యం అయ్యాయి. దాడి సమయంలో నౌకలో 180 మంది ఉన్నట్లు సమాచారం. తామే దాడి చేశామని ప్రకటించిన అమెరికా అందుకు సంబంధించిన వీడియో విడుదల చేసింది.ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై హిజ్బోల్లా దాడులు (Hezbollah Attacks) చేస్తోంది. దీంతో లెబనాన్‌లోని హిజ్బొల్లా స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది. మరోవైపు లెబనాన్ సైతం ఇజ్రాయెల్కు మద్దతుగా హిజ్బొల్లాపై యుద్ధం ప్రకటించింది.
ఇది కూడా చదవండి..: Iran Israel Conflict | ఇరాన్ అణు కేంద్రం ధ్వంసం.. సుప్రీం లీడర్ ఎవరున్నా చంపుతామన్న ఇజ్రాయెల్

