అక్షరటుడే, న్యూఢిల్లీ: Iran Israel War live updates | పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా–ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. ఈ దేశాల మధ్య యుద్ధం మొదలయ్యాక.. భారత ప్రధాని Narendra Modi నరేంద్ర మోడీ తొలిసారి గురువారం (మార్చి 12) రాత్రి ఇరాన్ అధ్యక్షుడు Masoud Pezeshkian తో ఫోన్‌లో మాట్లాడారు.
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం మరింత విస్తరించకుండా ఉండేందుకు దౌత్యపరమైన మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.

Iran Israel War live updates | హోర్ముజ్ జలసంధే ఇరాన్ ఆయుధం
ఇక, ఇరాన్ నూతన సుప్రీం లీడర్ Mojtaba Khamenei యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి అధికారికంగా ప్రకటన చేశారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతిగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచానికి కీలక చమురు రవాణా మార్గమైన Strait of Hormuz ను ఒత్తిడి సాధనంగా మార్చుకుంటామని హెచ్చరించారు. గల్ఫ్‌లో అమెరికా ప్రాంతీయ సైనిక స్థావరాలు మూసివేయకపోతే వాటిపై దాడులు నేలమట్టం చేస్తామని స్పష్టం చేశారు.
Iran Israel War live updates | 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధర
ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా యుద్ధం ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో హోర్ముజ్ జలసంధి ద్వారానే దాదాపు 20 శాతం రవాణా అవుతోంది. ఇక్కడ రవాణాకు అంతరాయం ఏర్పడటంతో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 100 డాలర్లు దాటింది.
యుద్ధం ఎలా ప్రారంభమైందంటే..
అమెరికా–ఇజ్రాయెల్ దేశాలు ఫిబ్రవరి 28న సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ Ali Khamenei చనిపోయారు. దీంతో ఇరాన్ ప్రతిగా డ్రోన్లు, క్షిపణులతో అమెరికా మిత్ర దేశాలపై అప్పటి నుంచి నిరంతరంగా దాడులు కొనసాగిస్తూనే ఉంది.
లెబనాన్‌లో ఉద్రిక్తత
యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా – ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ దేశంలోని పలు ప్రాంతాలపై వేలాది సైనిక దాడులు జరిపినట్లు సమాచారం. ఇదే సమయంలో లెబనాన్‌లోని హెజ్‌బొల్లా సైతం ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగించడం వల్ల ప్రాంతీయంగా మరింత ఉద్రిక్తత పెరిగింది. లక్షలాది జనాలు తమ నివాసాలను వదిలి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం
గల్ఫ్ ప్రాంతంలో నౌకలపై దాడులు జరగడం, చమురు రవాణా నిలిచిపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో తీవ్ర అస్థిరత కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
దౌత్యపరమైన ప్రయత్నాలు
ఈ నేపథ్యంలో యుద్ధం ఆపాలని భారత్ సహా ప్రపంచంలోని అనేక దేశాలు పిలుపునిస్తున్నాయి. ప్రధాని మోడీ కూడా ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి మాట్లాడారు. శాంతి, చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం సాధ్యమని ఇరాన్ కు సూచించారు.

