Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran Israel War | సౌదీ అరేబియాపై ఇరాన్​ బాంబుల వర్షం.. ఇద్దరు దుర్మరణం.. మృతుల్లో ఒకరు భారతీయుడిగా గుర్తింపు!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran Israel War | సౌదీ అరేబియాపై ఇరాన్​ బాంబుల వర్షం.. ఇద్దరు దుర్మరణం.. మృతుల్లో ఒకరు భారతీయుడిగా గుర్తింపు!

అంతర్జాతీయంతాజా వార్తలు

Iran Israel War | సౌదీ అరేబియాపై ఇరాన్​ బాంబుల వర్షం.. ఇద్దరు దుర్మరణం.. మృతుల్లో ఒకరు భారతీయుడిగా గుర్తింపు!

Naresh chandan
Last updated: మార్చి 9, 2026 2:12 ఉద.
Naresh chandan
3 వారాలు ago
Share
Iran Israel War | సౌదీ అరేబియాపై ఇరాన్​ బాంబుల వర్షం.. ఇద్దరు దుర్మరణం.. మృతుల్లో ఒకరు భారతీయుడిగా గుర్తింపు!
Iran Israel War | సౌదీ అరేబియాపై ఇరాన్​ బాంబుల వర్షం.. ఇద్దరు దుర్మరణం.. మృతుల్లో ఒకరు భారతీయుడిగా గుర్తింపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran Israel War | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. Israel – United States సంయుక్తంగా ఇరాన్​పై దాడులు కొనసాగిస్తున్నాయి. దీంతో Iran లో కీలక మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా ఆ దేశ రాజధాని Tehran లోని ఆయిల్ నిల్వ కేంద్రాలు, రిఫైనరీలపై దాడులు జరగడం ప్రాంతీయంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

Contents
  • Iran Israel War | గల్ఫ్​లో ఉద్రిక్తత
    • Iran Israel War | గల్ఫ్ దేశాలపై దాడుల ఆరోపణలు
      • లెబనాన్‌లోనూ వైమానిక దాడి
      • సౌదీ అరేబియాలో..

Iran Israel War | గల్ఫ్​లో ఉద్రిక్తత

గల్ఫ్ ప్రాంతంలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. Bahrain లోని సముద్ర జలాలను తాగునీటిగా మార్చే డిసాలినేషన్ ప్లాంట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి జరిపింది. దీంతో ప్లాంట్​కు నష్టం వాటిల్లిందని అక్కడి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

అదే సమయంలో దక్షిణ ఇరాన్‌లోని Qeshm Island లోని తాగునీటి డిసాలినేషన్ ప్లాంట్‌పై అమెరికా బాంబుల వర్షం కురిపించిందని ఇరాన్ ఆరోపించింది.

Iran Israel War | గల్ఫ్ దేశాలపై దాడుల ఆరోపణలు

Qatar, Saudi Arabia, Kuwait, United Arab Emirates దేశాలు సైతం గొంతు విప్పాయి. తమ దేశ భూభాగాల్లో ఇరాన్ దాడులు జరిగినట్లు ఆ దేశాలు వెల్లడించాయి. కాగా, Masoud Pezeshkian నేతృత్వంలోని ఇరాన్ సర్కారు గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పింది. గల్ఫ్​ భూభాగం నుంచి దాడులు జరగకపోతే గల్ఫ్ దేశాలపై దాడులు చేయమని ఆయన హామీ ఇచ్చారు.

లెబనాన్‌లోనూ వైమానిక దాడి

Lebanon రాజధాని Beirut లో ఉన్న ఒక హోటల్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు మృతి చెందినట్లు సమాచారం. ఈ దాడి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసింది.

సౌదీ అరేబియాలో..

Saudi Arabia లో జరిగిన దాడుల్లో ఇద్దరు దుర్మరణం చెందినట్లు ఆ దేశ సర్కారు తెలిపింది. మృతుల్లో ఒకరు భారతీయుడు, మరొకరు బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి ఉన్నట్లు పేర్కొంది. ఈ ఘటనతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ ప్రభావం సాధారణ జనంపై పడుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

T20 World Cup | సెమీస్ ఆశలు పదిలం.. జింబాబ్వేపై భారత జట్టు విజయభేరి
Mojtaba Khamenei | ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ.. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి హెచ్చరికలు
Kalvakuntla Kavitha arrest | కల్వకుంట్ల కవిత అరెస్ట్​.. జాగృతి కార్యాలయంలో దీక్ష కొనసాగింపు
Ananda Bose Resignation | పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్‌ రాజీనామా
Padma River Bus Accident | ఘోర విషాదం.. పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు 23 మంది దుర్మరణం!
TAGGED:global war updatesGulf tensionsIran Israel warIsrael Iran strikesMiddle East conflictMiddle East CrisisSaudi Arabia attack newsTehran attack news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Induru Tirumala Brahmotsavam Induru Tirumala Brahmotsavam | నేత్రపర్వంగా ఇందూరు తిరుమల పుష్కర బ్రహ్మోత్సవాలు
Next Article March 09 Horoscope March 09 Horoscope | మార్కెటింగ్ రంగంలో ఉన్నత పదవి.. ఉద్యోగ మార్పుతో ఈ రాశుల వారికి అద్భుత యోగం!
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?