అక్షరటుడే, వెబ్‌డెస్క్: Iran Israel War UPDATES | United States – Israel – Iran మధ్య కొనసాగుతున్న యుద్ధం రెండో వారంలోకి ప్రవేశించింది. మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం అయ్యాయి. పరస్పర వైమానిక, డ్రోన్ దాడులు, క్షిపణి ప్రయోగాలతో పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా మారింది. తాజాగా ఇరాన్ డ్రోన్ దాడితో Bahrainలో 32 మంది పౌరులు గాయపడినట్లు స్థానిక అధికారులు ప్రకటించారు.
యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో Saudi Arabiaలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని United States సూచించింది. భద్రతా పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Iran Israel War UPDATES | కొత్త సుప్రీంగా మోజ్తాబా ఖమేనీ
ఇక ఇరాన్‌లో కీలక రాజకీయ మార్పు చోటుచేసుకుంది. Mojtaba Khameneiను ఆ దేశం తన కొత్త సుప్రీం లీడర్‌గా అధికారికంగా ప్రకటించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకటించింది. అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో తన తండ్రి, మాజీ సుప్రీం లీడర్ Ali Khamenei మరణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌లో అత్యున్నత మతాధికారులతో కూడిన అసెంబ్లీ మోజ్తాబా ఎన్నికను ఆమోదించినట్లు ఇరాన్ వెల్లడించింది.
Iran Israel War UPDATES | అమెరికా – ఇజ్రాయెల్ ప్రకటనలు
యుద్ధంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు Donald Trump కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం ముగింపుపై తుది నిర్ణయాన్ని Benjamin Netanyahuతో కలిసి చర్చించి తీసుకుంటామని తెలిపారు. మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అమెరికా సైనికులు పట్టుబడ్డారు – ఇరాన్
ఇరాన్ భద్రతా అధికారి Ali Larijani సంచలన ప్రకటన చేశారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చాలా మంది అమెరికా సైనికులను ఇరాన్ బలగాలు పట్టుకున్నాయని పేర్కొన్నారు. కానీ, ఈ వ్యాఖ్యలను United States Central Command ఖండించింది. తమ సైనికుల్లో ఏ ఒక్కరు కూడా పట్టుబడలేదని స్పష్టం చేసింది.
దాడు ఉండవని చెప్పినా..
గల్ఫ్ దేశాలపై దాడులు ఉండవని ఇరాన్ అధ్యక్షుడు Masoud Pezeshkian ఇంతకు ముందు ప్రకటించారు. దాడిలో జరిగిన నష్టానికి ప్రాంతీయ దేశాలకు క్షమాపణలు తెలిపారు. గల్ఫ్ ప్రాంతాల నుంచి తమ దేశంపై దాడులు జరగకుంటే.. తాము కూడా ఆ దేశాలపై దాడి చేయమని అన్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్ఙితి వేరేలా ఉంది. దాడులు నిరంతరం కొనసాగుతున్నాయి.
మొత్తంగా అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. మధ్యప్రాచ్య ప్రాంతంలో భద్రతా పరిస్థితులు మరింత క్షీణిస్తోంది. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందోనని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.
ఇది కూడా చదవండి: Mojtaba Khamenei | ఇరాన్ సుప్రీమ్‌గా ఖమేనీ కొడుకు మోజ్తాబా ఎన్నిక!
ఇది కూడా చదవండి: Iran Israel War | సౌదీ అరేబియాపై ఇరాన్ బాంబుల వర్షం.. ఇద్దరు దుర్మరణం.. మృతుల్లో ఒకరు భారతీయుడిగా గుర్తింపు!

