Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran Missile Attack | అమెరికా నౌక అబ్రహం లింకన్​పై ఇరాన్​ దాడి!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran Missile Attack | అమెరికా నౌక అబ్రహం లింకన్​పై ఇరాన్​ దాడి!

అంతర్జాతీయం

Iran Missile Attack | అమెరికా నౌక అబ్రహం లింకన్​పై ఇరాన్​ దాడి!

అమెరికా యుద్ధనౌక అబ్రహం లింకన్​పై దాడి చేసినట్లు ఇరాన్​ తెలిపింది. నౌకపై క్షిపణులను ప్రయోగించామని పేర్కొంది.

Srinivas kolluri
Last updated: మార్చి 25, 2026 6:46 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Iran Missile Attack

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran Missile Attack | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఓ వైపు అమెరికా యుద్ధానికి ఐదు రోజులు విరామం ప్రకటించినట్లు చెప్పినా.. ఇరాన్​, ఇజ్రాయెల్​ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అమెరికా (America) యుద్ధనౌకపై క్షిపణి దాడి చేసినట్లు ఇరాన్​ ప్రకటించింది.

Contents
  • Iran Missile Attack | దూరంగా వెళ్లిన నౌక
    • Iran Missile Attack | 1,340 మంది మృతి

యూఎస్ఎస్ అబ్రహం లింకన్ (Abraham Lincoln) విమానవాహక నౌక వైపు తాము ఒక క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్ అధికారిక టెలివిజన్ పేర్కొంది. దీనిపై అమెరికా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. అబ్రహం లింకన్ నౌక తమ నిఘాలో ఉందని, అది తమ భూభాగానికి సమీపిస్తే లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ ముందుగా హెచ్చరించింది. అనంతరం క్షిపణి ప్రయోగించినట్లు ఇరాన్​ సైన్యం బుధవారం తెలిపింది.

Iran Missile Attack | దూరంగా వెళ్లిన నౌక

ఇరాన్ నావికాదళ కమాండర్, రియర్ అడ్మిరల్ షహ్రామ్ ఇరానీ “శత్రువు” విమాన వాహక నౌక అబ్రహం లింకన్ కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. అది ఇరాన్ క్షిపణి వ్యవస్థల పరిధిలోకి ప్రవేశించిన వెంటనే దాడి చేస్తామన్నారు. అనంతరం నౌక సమీపంలోకి రాగానే క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలిపారు. దీంతో అబ్రహం లింకన్​ నౌక తన స్థానాన్ని మార్చుకోవలసి వచ్చిందన్నారు. అయితే ఇరాన్​ ప్రకటనపై అమెరికా స్పందించలేదు.

Iran Missile Attack | 1,340 మంది మృతి

ఇరాన్​పై ఫిబ్రవరి 28 నుంచి అమెరికా, ఇజ్రాయెల్ (Israel) వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ దాడులలో అప్పటి సుప్రీం నాయకుడు అలీ ఖమేనీతో సహా ఇప్పటివరకు 1,340 మందికి పైగా మరణించారు. దీంతో ఇరాన్​ ప్రతీకార దాడులు చేస్తోంది. అమెరికా సైనిక స్థావరాలు ఉన్న ఇజ్రాయెల్, జోర్డాన్, గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని టెహ్రాన్ డ్రోన్, క్షిపణులను ప్రయోగిస్తోంది. కాగా అమెరికా ఎఫ్​–35 (F-35) విమానంపై దాడి చేసినట్లు ఇటీవల ఇరాన్​ తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోను సైతం విడుదల చేసింది. తాజాగా విమాన వాహన నౌకపై క్షిపణులు ప్రయోగించినట్లు తెలిపింది.

దీనిని కూడా చదవండి : Iran Currency Collapse | ఏడున్నర డాలర్లుంటే.. అక్కడ కోటీశ్వరులే!

Jeffrey Epstein Documentary | బాలికల మాంసం ముద్దలపై ఎప్‌స్టీన్ దుష్కృత్యాలు.. ప్రపంచాన్ని కుదిపేస్తున్న భారీ సెక్స్​ కుంభకోణం..
Iran US Embassy Attack | అమెరికా ఎంబసీపై ఇరాన్​ దాడి
Hormuz LPG ships | భారత్​కు ఊరట.. హార్ముజ్​ జలసంధిని దాటిన రెండు నౌకలు
Modi Iran Call | ఇరాన్​ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోదీ
 Iran Yuan Oil Payments | అమెరికాకు ఇరాన్​ బిగ్​ షాక్​.. చైనీస్​ యువాన్​తో చెల్లింపులు
TAGGED:abraham lincoln carrierIran missile attackiran vs israelMiddle East tensionsUS Iran conflictus warship
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article BC Caste Census | BC Caste Census | బీసీలను విస్మరిస్తే తగిన బుద్ధి చెప్తాం..
Next Article Country Bomb Incident | Country Bomb Incident | సదాశివనగర్​లో కలకలం.. నాటుబాంబు పేలి గేదెకు గాయాలు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?