అక్షరటుడే, వెబ్‌డెస్క్: Iran Missile Attacks | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రం అయ్యాయి. ఇరాన్ తాజాగా క్షిపణి దాడులతో గల్ఫ్ దేశాలను దద్దరిల్లించాయి. ముందుగానే హెచ్చరించినట్టుగానే ఇరాన్ భారీ స్థాయిలో మిస్సైల్ దాడులకు దిగింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తదితర కీలక దేశాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం. ముఖ్యంగా ఖతార్‌లోని రస్ లఫాన్ (Ras Laffan) పరిశ్రమ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దేశం దాడులు జరిపినట్లు తెలుస్తోంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఎల్ఎన్జీ (LNG) ఉత్పత్తి కేంద్రాలలో ఒకటిగా ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇక సౌదీ అరేబియాలోకి దూసుకొచ్చిన ఇరాన్ దేశ మిస్సైళ్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకున్నట్లు ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. యూఏఈలోనూ కొన్ని ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు సూచించారు.
Iran Missile Attacks | మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం పరిస్థితి…
ఇరాన్–అమెరికా–ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్ దేశంలో పరోక్ష ఘర్షణలు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇటీవల జరిగిన దాడుల్లో ఇరాన్ కీలక నాయకులు మరణించడంతో ఈ ఘర్షణలు మరింత తీవ్రం అయ్యాయి. దీనికి ప్రతీకారంగానే ఇరాన్ ఈ దాడులు చేపట్టినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
దీనికితోడు, సముద్ర మార్గాల్లోనూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద నౌకాయాన భద్రతపై ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద భాగం రవాణా అవుతుంటుంది. ఇక్కడ ఏ చిన్న అంతరాయం ఏర్పడినా.. గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది.
Iran Missile Attacks | ప్రపంచ దేశాల ఆందోళన
అమెరికా, యూరోపియన్ దేశాలు తాజా పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. గల్ఫ్ దేశాలు తమ రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తున్నాయి. యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆర్థిక ప్రభావం
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై నేరుగా పడుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గ్లోబల్ ట్రేడ్, ఎనర్జీ సరఫరాపైనా ఈ పరిస్థితులు ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Iran Gulf War Warning | భారీ దాడులు చేస్తాం.. గల్ఫ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్

