అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Iran President | హర్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని నేటి రాత్రిలోపు తెరవకపోతే పెద్ద ఎత్తున దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు 1.4 కోట్ల మంది ఇరాన్ ప్రజలు ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
హర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని పవర్ ప్లాంట్లు, వంతెనలపై పెద్ద ఎత్తున దాడి చేస్తామని, ఆ దేశాన్ని నరకంగా మారుస్తామని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆ గడువు మరికొద్ది గంటల్లో ముగియనుంది. ఈ క్రమంలో పెజెష్కియాన్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 14 మిలియన్లకు పైగా ఇరాన్ ప్రజలు తమ ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన ప్రకటించారు. తాను కూడా ఇరాన్ కోసం ప్రాణాలను అర్పించడానికి గతంలోనూ, ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నానని వెల్లడించారు.
Iran President | ఏం జరుగుతుందో..
హర్ముజ్ జలసంధి మీదుగా నౌకాయానానికి అనుమతి ఇవ్వాలని ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు విధించిన గడువు సమీపిస్తున్న తరుణంలో ఆయన (Iran President ) ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ టెహ్రాన్ దీనికి కట్టుబడకపోతే, కీలకమైన మౌలిక సదుపాయాలపై భారీ దాడులు చేస్తామని వాషింగ్టన్ హెచ్చరిస్తోంది. గడువు సమీపిస్తున్నప్పటికీ ఇరాన్ వెనక్కి తగ్గే సంకేతాలు ఏవీ చూపించలేదు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరిగే అవకాశం ఉందనే భయాల మధ్య, విద్యుత్ ప్లాంట్లతో సహా కీలకమైన ప్రదేశాల చుట్టూ మానవ హారాలు ఏర్పాటు చేయాలని అధికారులు యువతను కోరారు. ఇరాన్‌లోని రైళ్లు, రైల్వే స్టేషన్లపై దాడులు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు రైళ్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
🚨 BREAKING: Iran’s President says over 14 million Iranians are ready to sacrifice their lives to defend the country,
“I too am ready to give my life for Iran.” pic.twitter.com/ImXOBBvKy6
— Globe Observer (@_GlobeObserver) April 7, 2026
దీనిని కూడా చదవండి : Panama Canal Explosion | పనామా కాలువ బ్రిడ్జి సమీపంలో భారీ పేలుడు
