అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Iran UAE Tensions | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో యూఏఈని ఇరాన్ హెచ్చరించింది. రస్ అల్ ఖైమా సిటీపై దాడులు చేస్తామని తెలిపింది. రెండు లక్షల జనాభా కలిగిన ఆ నగరాన్ని ఖాళీ చేయాలని ఆదేశించింది.
ఇరాన్ రాస్ అల్-ఖైమా (Iran – Ras All Khaimah) నగర ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ ప్రాంతాన్ని ఇరాన్‌లోని దీవులపై దాడులు చేయడానికి ఉపయోగిస్తున్నందునా.. తాము దాడులు ఆ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంటామని తెలిపింది. ప్రజలు వీలైనంత త్వరగా నగరాన్ని విడిచి వెళ్లాలని ఐఆర్‌జీసీ (IRGC) కోరింది. తమ దీవులపై ఎమిరేట్స్ భూభాగం నుంచి దాడులు జరిగితే, రాస్ అల్ ఖైమాపై దాడి చేస్తామని యూఏఈని హెచ్చరించింది. జాతీయ సార్వభౌమాధికారానికి ముప్పు వాటిల్లితే నిర్ణయాత్మకంగా ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ సైనిక అధికారులు పునరుద్ఘాటించారు.
Iran UAE Tensions | లక్ష్యంగా చేసుకుంటాం
ఇరాన్‌లోని ఖతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫఘారి (Ibrahim Zolfaghari) మాట్లాడుతూ.. తమ సార్వభౌమాధికారంపై దాడుల కోసం ఉపయోగించే “ఏ ప్రయోగ స్థావరాన్నైనా” టెహ్రాన్ లక్ష్యంగా చేసుకుంటుందని స్పష్టం చేశారు. పెరిగిన ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ మౌలిక సదుపాయాలపై ఇటీవల జరిగిన దాడుల నేపథ్యంలో జొల్ఫఘరి ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బాగ్దాద్‌లోని అమెరికన్ ఎంబసీ (American Embassy)పై మరోసారి ఇరాన్ దాడులు చేసింది.
Iran UAE Tensions | పర్యాటక కేంద్రాలపై..
గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. పర్యాటక కేంద్రాలను టార్గెట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. పార్కులు, వినోద కేంద్రాలు, టూరిస్ట్ డెస్టినేషన్స్‌పై దాడులు చేస్తామని ఇరాన టాప్ మిలిటరీ కమాండర్ జనరల్ షెకార్చి తెలిపారు. ఇజ్రాయెల్ (Israel) నివాస సముదాయాలనూ ఇరాన్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. కాగా చమురు, గ్యాస్ క్షేత్రాలపై దాడులతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. కాగా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందోనని ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి.
ఇది కూడా చదవండి..: HMPV Virus | అమెరికాపై మరో ప్రమాదకర వైరస్ పంజా.. వేగంగా విస్తరిస్తున్న HMPV!

