అక్షరటుడే, వెబ్‌డెస్క్: Iran US Ceasefire | పశ్చిమాసియాలో యుద్ధానికి తాత్కాలిక విరామం లభించిన విషయం తెలిసిందే. ఇరాన్–అమెరికా (Iran–America) కాల్పుల విరమణకు అంగీకరించాయి. రెండు వారాల పాటు సీజ్ ఫైర్ (Cease Fire) అమలులో ఉంది. ఈ నేపథ్యంలో శాశ్వత పరిష్కారం కోసం రెండు దేశాలు పాకిస్థాన్‌లో భేటీ కానున్నాయి.
పాక్‌లోని ఇస్లామాబాద్ (Islamabad)లో ఇరుదేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరగనున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం ఇప్పటికే పాక్ చేరుకుంది. ఈ టీమ్‌లో ట్రంప్ సన్నిహితుడు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ కూడా ఉన్నారు. చర్చలకు ముందు ఇరాన్ రెండు నిబంధనలు పెట్టింది. లెబనాన్‌లో సీజ్‌ఫైర్, ఫ్రీజ్ చేసిన ఆస్తులను రిలీజ్ చేయాలని కండిషన్స్ పెట్టింది. వీటికి ఓకే అంటేనే చర్చలకు వస్తామని తేల్చి చెప్పింది. దీంతో ఆ కండీషన్స్‌కు అమెరికా ఒప్పుకుంది. కాసేపట్లో పాక్ ప్రధానితో ఇరాన్ బృందం భేటీ కానుంది. అర్ధరాత్రి పాక్ ఆర్మీ చీఫ్ (Pakistan Army Chief)తో ఇరాన్ ప్రతినిధులు చర్చించారు.
Iran US Ceasefire | భారీ భద్రత
పాక్ కేంద్రంగా ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరుగుతుండటం అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో పాక్ ప్రభుత్వం (Pakistan Government) ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా చర్యలు చేపట్టింది. ఇస్లామాబాద్‌లో భారీ భద్రత ఏర్పాటు చేసింది. 10 వేల మంది బలగాలను మోహరించింది. శాంతి చర్చల సందర్భంగా ఇస్లామాబాద్‌లో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. మరోవైపు ఇస్లామాబాద్ చేరుకున్న అమెరికా బృందానికి పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ స్వాగతం పలికారు.
Iran US Ceasefire | పరోక్ష పద్ధతిలో..
అమెరికా, ఇరాన్ మధ్య ముందుగా పరోక్ష పద్ధతుల్లో చర్చలు జరగనున్నాయి. మధ్యాహ్నం తర్వాత చర్చలు ప్రారంభం అవుతాయని అధికారులు వేర్వేరు గదుల్లో ఇరాన్, అమెరికా ప్రతినిధులతో పాక్ మధ్యవర్తుల చర్చలు జరుపుతారు. తొలి దశ చర్చలు సాఫీగా సాగితే రాత్రికి ముఖాముఖి చర్చలు ఉంటాయి. అనంతరం ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..: Hormuz Sea Mines | హర్ముజ్‌లో మరో సమస్య.. సీమైన్స్ ఎక్కడున్నాయో తెలియదంటున్న ఇరాన్
