Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran US conflict | ఇరాన్​ దెబ్బకు అమెరికాకు భారీ నష్టం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran US conflict | ఇరాన్​ దెబ్బకు అమెరికాకు భారీ నష్టం

అంతర్జాతీయం

Iran US conflict | ఇరాన్​ దెబ్బకు అమెరికాకు భారీ నష్టం

సౌదీలోని ప్రిన్స్​ సుల్తాన్​ ఎయిర్​ బేస్​పై ఇరాన్​ దాడులు చేసింది. ఈ ఘటనలో అమెరికాకు చెందిన యుద్ధ విమానం ధ్వంసం అయింది.

Srinivas kolluri
Last updated: మార్చి 29, 2026 12:36 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Iran US conflict

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran US conflict | అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో కీలక నేతలను కోల్పోతున్నా.. ఇరాన్​ మాత్రం ప్రతీకార దాడులను ఆపడం లేదు. పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. అంతేగాకుండా ఇటీవల అమెరికా యుద్ధ విమానంపై సైతం ఇరాన్​ దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా రూ.కోటి విలువ చేసే క్షిపణితో అమెరికాకు చెందిన రూ.5,600 కోట్ల విలువైన యుద్ధ విమానాన్ని ధ్వంసం చేసింది.

Contents
  • Iran US conflict | మార్చి 27న దాడి
    • Iran US conflict | ఇరాన్​ వ్యూహాత్మక దాడులు

సౌదీలోని ప్రిన్స్​ సుల్తాన్​ ఎయిర్​ బేస్​పై ఇటీవల ఇరాన్​ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన E-3 Sentry AWACS దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. Boeing తయారు చేసిన ఈ ఎయిర్‌క్రాఫ్ట్ విలువ సుమారు రూ.5,600 కోట్లు ఉంటుందని సమాచారం. 250 మైళ్ల పరిధిలో రాడార్‌తో శత్రు కదలికలను గుర్తించే సామర్థ్యం దీనికి ఉంది. ఈ దాడిలో 10 మందికి పైగా సైనికులు గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో పాటు ఇతర విమానాలు సైతం దెబ్బతిన్నాయి. అందులో గగనతల ఇంధన ట్యాంకర్లు కూడా ఉన్నాయి.

Iran US conflict | మార్చి 27న దాడి

గల్ఫ్​ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్​ (Iran) దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మార్చి 27న ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ (Prince Sultan Air Base)​పై క్షిపణిని ప్రయోగించింది. దీతో ఒక E-3 విమానానికి భారీగా నష్టం వాటిల్లినట్లు ‘ఎయిర్ & స్పేస్ ఫోర్సెస్ మ్యాగజైన్’ తెలిపింది. ఈ ఘటనకు ముందు ఆ ఎయిర్ బేస్‌లో ఆరు E-3 విమానాలు మోహరించి ఉన్నాయి. మార్చి 27న జరిగిన ఇరాన్ దాడిలో ఒక యూఎస్ఏఎఫ్ ఈ-3 విమానం, ట్యాంకర్లు దెబ్బతిన్నాయని తెలిసింది.

Iran US conflict | ఇరాన్​ వ్యూహాత్మక దాడులు

అమెరికా, ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ఇరాన్​పై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ టెహ్రాన్​పై దాడులను కొనసాగిస్తోంది. అయితే ఇరాన్​ మాత్రం వ్యూహాత్మకంగా దాడులు చేస్తోంది. కీలక నేతలు చనిపోతున్నా ఐఆర్​జీసీ వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతుంది. దుబాయిలోని థాడ్​ ఎయిర్​ డిఫెన్స్​ సిస్టంను కూడా ఇరాన్​ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అంతేగాకుండా అమెరికాకు చెందిన ఎఫ్​–35 విమానంపై దాడి చేయడంతో అది అత్యవసరంగా ల్యాండ్​ అయింది.

దీనిని కూడా చదవండి : Ethanol Usage India | ఇథనాల్​ వాడకంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

US Israel Iran Conflict | అమెరికా – ఇజ్రాయెల్​ దాడులు.. నాలుగో రోజూ కొనసాగుతున్న ఉద్రిక్తత!
Mojtaba Khamenei | ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ.. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి హెచ్చరికలు
Anthropic Trump Dispute | ఆంథ్రోపిక్‌కు షాకిచ్చిన ట్రంప్..
Putin Backs Mojtaba Khamenei | మోజ్తాబా ఖమేనీకి పుతిన్ మద్దతు.. యుద్ధం రూపు మారనుందా..?
India UAE Talks | యూఏఈ ప్రెసిడెంట్​కు మోడీ ఫోన్​.. ఏమేమి మాట్లాడుకున్నారంటే..!
TAGGED:Gulf tensionsIran US conflictMiddle East Crisismissile drone attacksUS air force aircraftUS military losses
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Gandhari Bike Accident | Gandhari Bike Accident | గాంధారిలో విషాదం.. డివైడర్​ను బైక్​ ఢీకొని ముగ్గురి మృతి
Next Article Drunk Driving Case | Drunk Driving Case | డ్రంకన్ డ్రైవ్ కేసులో పలువురికి జైలుశిక్ష
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?