అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Iran US Conflict | హర్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని తెరవకపోతే ఇరాన్‌పై పెద్ద ఎత్తున దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇరాన్‌లోని పవర్ ప్లాంట్లు, వంతెనలను లక్ష్యంగా చేసుకుంటామని, ఆ దేశాన్ని నరకం చేస్తామని ఆయన హెచ్చరించారు. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ సైతం దీటుగా స్పందించింది.
డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బెదిరింపులపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ.. తమ మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడి జరిగినా దానికి తగిన విధంగానే ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. అమెరికా దాడులు చేస్తే తాము చూస్తూ ఊరుకోమన్నారు. అమెరికా యాజమాన్యంలో ఉన్న, అమెరికాకు సంబంధించిన, ఇరాన్‌పై వారి దురాక్రమణ చర్యకు దోహదపడే ఎలాంటి మౌలిక సదుపాయాలనైనా తమ సాయుధ దళాలు లక్ష్యంగా చేసుకుంటాయని పేర్కొన్నారు.
Iran US Conflict | నరకంలోకి అమెరికా…
ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్-బఘేర్ ఘాలిబాఫ్ స్పందిస్తూ.. వాషింగ్టన్ ఒక “నరకంలోకి” లాగబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ట్రంప్ దుందుడుకు చర్యలు అమెరికాలోని ప్రతి ఒక్క కుటుంబాన్ని నరకంలోకి నెడుతున్నాయని విమర్శించారు. ‘యుద్ధ నేరాల ద్వారా మీరు ఏమీ సాధించలేరని” ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ప్రజల హక్కులను గౌరవించడం, ఈ ప్రమాదకరమైన ఆటను ముగించడమే నిజమైన పరిష్కారమన్నారు.
కాగా మంగళవారంలోగా హర్ముజ్ జలసంధిని తెరవాలని ట్రంప్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా (Social Media)లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో అసభ్యకర పదజాలాన్ని ఆయన ఉపయోగించారు. జలసంధిని తెరవకపోతే మంగళవారం ఇరాన్‌పై వైమానిక దాడులు చేస్తామన్నారు. అయితే ట్రంప్ హెచ్చరికలన ఇరాన్ లెక్క చేయడం లేదు. దీంతో రేపు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి..: Tesla safety system | టెస్లా భద్రత రాజసం.. అడుగు దూరంలో ప్రమాదం నివారణ!
