అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Iran US Tensions | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్రం అవుతున్నాయి. ఇరాన్ (Iran)పై భూతల దాడులు చేస్తామని ఇటీవల అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాకు ఇరాన్ వార్నిగ్ ఇచ్చింది.
అమెరికా (America)ను సవాల్ చేస్తూ ఇరాన్ తాజాగా వీడియో విడుదల చేసింది. దమ్ముంటే భూతల దాడులకు రావాలని సవాల్ విసిరింది. తమ సైన్యం పూర్తి సిద్ధంగా ఉందంటూ పేర్కొంది. అమెరికా బలగాలు వస్తే తిరిగి వెళ్లవని వార్నింగ్ ఇచ్చింది. భూతల యుద్ధం మొదలైతే శవపేటికల ఇండస్ట్రీకి ఫుల్ బిజినెస్ అంటూ పేర్కొంది. రేపటి నుంచి యూఎస్‌పై ప్రతీకార దాడులు చేస్తామని టెహ్రాన్ ప్రకటించింది. యూఎస్ కంపెనీలే లక్ష్యంగా దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. తమ భూభాగంపై దాడి చేయడానికి ప్రయత్నించే దురాక్రమణదారుల కాళ్ళు నరికేస్తామని ప్రకటించింది.
Iran US Tensions | రష్యా యూనిట్లు
అమెరికా భూతల దాడి జరిగితే రష్యా (Russia)కు చెందిన చెచెన్ యూనిట్లు ఇరాన్‌లో మోహరించడానికి సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ఇరాన్ నౌకాదళం, క్షిపణి సామర్థ్యాలను బలహీనపరచడం వంటి కీలక లక్ష్యాలను సాధించామని అమెరికా తెలిపింది. నాలుగు నుంచి ఆరు వారాలలోపు ఇరాన్‌లో సైనిక చర్యలను ముగించవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు టెహ్రాన్ (Tehran)లో అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
Iran US Tensions | అణుబాంబు లేదు
అమెరికా రక్షణమంత్రి హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబు (Nuclear Bomb) లేదన్నారు. ఇరాన్ నేవీ మొత్తం నిర్వీర్యం అయిందని పేర్కొన్నారు. ఇరాన్‌తో డీల్ కుదుర్చుకునే ఉద్దేశం ట్రంప్‌కు ఉందని చెప్పారు. ఇరాన్ డీల్‌కు ఒప్పుకోకపోతే దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు.
దీనిని కూడా చదవండి : Trump Warning to Iran | ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.. హార్ముజ్ జలసంధి తెరవకపోతే వాటిని పేల్చేస్తామని హెచ్చరిక
