అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Iran War Ceasefire | ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ (Iranian President Pezeshkian) సంచలన ప్రకటన చేశారు. తాము యుద్ధం ముగించేందుకు సిద్ధమని తెలిపారు. కానీ మూడు షరతులకు అంగీకరించాలని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ఆయా దేశాలతో పాటు ప్రపంచ దేశాలు సైతం ఆందోళన చెందుతున్నారు. చమురు, గ్యాస్ సంక్షోభంతో అల్లాడుతున్నాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందోనని ఆయా దేశాల ప్రజలు సైతం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ యుద్ధాన్ని ముగించడానికి సిద్ధమని తెలిపారు. అందుకోసం ఇరాన్ హక్కులను అంగీకరించాలని, భవిష్యత్ దురాక్రమణకు వ్యతిరేకంగా నిర్ణయాత్మక అంతర్జాతీయ హామీ ఇవ్వాలని, దాడులతో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Iran War Ceasefire | కొనసాగుతున్న దాడులు
ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో 16 వేల ఇళ్లు ధ్వంసం అయినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసి ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ (Supreme Leader Khamenei)ని హతమార్చిన విషయం తెలిసిందే. ప్రతిగా ఇరాన్ సైతం పెద్ద ఎత్తున ప్రతీకారదాడులు చేపడుతోంది. డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, చమురు ట్యాంకర్లపై దాడులు చేస్తోంది. జోర్డాన్‌లోని అల్-అజ్రాక్, సౌదీ అరేబియాలోని అల్-ఖార్జ్ వంటి ప్రాంతంలోని US స్థావరాలను తమ ఆయుధాలు తాకినట్లు IRGC పేర్కొంది.
ఇది కూడా చదవండి..: Trump Warns Iran | దాడులు 20 రెట్లు పెరుగుతాయి.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

