అక్షరటుడే, వెబ్‌డెస్క్: Iran warning employees | మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన పలు ప్రముఖ బహుళజాతి కంపెనీల ఉద్యోగులకు Iran ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం.
Iran warning employees | ఏప్రిల్ 1 డెడ్లైన్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులో ఇరాన్ జారీ చేసినట్లుగా ఓ ప్రకటన ఉంది. దీని ప్రకారం.. మధ్యప్రాచ్య ప్రాంతంలో పనిచేస్తున్న అమెరికాకు చెందిన పలు సంస్థల ఉద్యోగులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు వీలైనంత త్వరగా ఈ ప్రాంతాన్ని విడిచిపోవాలని సూచించింది. ఏప్రిల్ 1 రాత్రి 8:00 గంటల (ఇరాన్ కాలమానం ప్రకారం) తర్వాత పరిస్థితులు మరింత విషమించవచ్చని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
Iran warning employees | కంపెనీలు ఇవే..
ఇరాన్ ఆరోపణల ప్రకారం పరిశీలిస్తే.. కొన్ని అంతర్జాతీయ కంపెనీలు “ఉగ్రవాద చర్యలకు సంబంధించి వ్యూహాత్మక / సాంకేతిక సహకారం అందిస్తున్నాయి” అనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో Tesla, GE, Meta, Apple, HP, Microsoft, Google, Intel, Cisco, Boeing, Oracle, IBM, Nvidia, J.P. Morgan, Dell, Palantir, Spire Solutions, G42 కంపెనీల ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసింది.
కాగా, ఈ సంస్థలు ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నాయనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. కానీ, “ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇచ్చే పలు సంస్థలపై తగిన ప్రతిచర్యలు ఉంటాయి..” అని ఇరాన్ సర్కారు హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Musi River Development | కాలుష్య నది నుంచి జీవ ధారగా.. ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక–టూరిజం కేంద్రంగా.. మూసీ పునరుజ్జీవమైతే జరిగేది అదే!
