అక్షరటుడే, వెబ్‌డెస్క్: Iran Warship Sinking | మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సమయంలో.. శ్రీలంక (Sri Lanka) తీరంలో అనూహ్య ఘటన జరిగింది. ఆ దేశ తీరంలో ఇరాన్‌కు చెందిన యుద్ధ నౌక మునిగిపోయింది.
తమ దేశానికి చెందిన దక్షిణ తీరంలో మునిగిపోతున్న ఇరాన్ యుద్ధ నౌక నుంచి 32 మందిని రక్షించినట్లు ఓ అధికారి తెలిపారు. కాగా.. బాధితులను ఆస్పత్రిలో చేర్పించినట్లు పేర్కొన్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, ఏడుగురికి అత్యవసర చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.
Iran Warship Sinking | గాలె తీరానికి కొద్దిదూరంలో..
ఇరాన్‌కు చెందిన ‘ఐఆర్‌ఐఎస్ దేనా’ (‘IRIS Dena’) అనే యుద్ధ నౌక గాలె తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదంలో పడినట్లు శ్రీలంక నౌకాదళానికి సమాచారం వచ్చింది. దీంతో వెంటనే సహాయక చర్యల కోసం నౌకలు, ఎయిర్‌ఫోర్స్ విమానాలను పంపించారు. ఈ నౌకలో 180 మంది ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. వారిలో సుమారు 30 మందిని రక్షించినట్లుగా శ్రీలంక విదేశాంగ మంత్రి పార్లమెంట్‌కు తెలిపారు.
Iran Warship Sinking | అట్టుడుకున్న పశ్చిమాసియా
పశ్చిమాసియా ప్రాంతం దాడులతో అట్టుడుకుతోంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులు.. ఇరాన్ ప్రతిదాడులతో ఆ ప్రాంతం అంతా భీతావాహ పరిస్థితి నెలకొంది. క్షిపణులు, డ్రోన్లలతో ఆయా దేశాలు దాడులు చేసుకుంటున్నాయి. కాగా.. మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. కాగా.. అసలు నౌక ఎలా మునిగింది.. ఎలా దెబ్బతిన్నది.. సిబ్బంది ఎలా గాయపడ్డారు.. ఎంత మంది గాయపడ్డారనే పూర్తి వివరాలు తెలియరాలేదు. అయితే, ఈ నౌకపై జలాంతర్గామి దాడి జరిగిందని.. సుమారు 100 మందికిపైగా గల్లంతయ్యారని, 78 మంది గాయపడ్డారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Iran Warship Sinking | ఇరాన్ కొత్త యుద్ధ నౌకల్లో ఒకటి
‘ఐఆర్‌ఐఎస్ దేనా’ అనేది ఇరాన్ కొత్త యుద్ధ నౌకల్లో ఒకటి. ఇది అమెరికా (America) ఆంక్షల జాబితాలో కూడా ఉంది. అయితే ఇటీవల విశాఖపట్నం తీరంలో నిర్వహించిన విన్యాసాల్లో పాల్గొన్న నౌక.. తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
At least 101 people missing after submarine attack on Iranian ship off Sri Lanka.
At least 101 people are missing and 78 injured following a reported submarine attack on the Iranian frigate IRIS Dena off Sri Lanka’s coast, according to Reuters citing naval and defence sources.… pic.twitter.com/JliKH8TUTX
— Sri Lanka Tweet 🇱🇰 (@SriLankaTweet) March 4, 2026
ఇది కూడా చదవండి..: Mojtaba Khamenei Iran | ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు

