Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: IRCTC Summer Tours | సమ్మర్ టూర్‌కు ఐఆర్‌‌సీటీసీ రెడీ.. హైదరాబాద్ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - IRCTC Summer Tours | సమ్మర్ టూర్‌కు ఐఆర్‌‌సీటీసీ రెడీ.. హైదరాబాద్ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లు

జాతీయం

IRCTC Summer Tours | సమ్మర్ టూర్‌కు ఐఆర్‌‌సీటీసీ రెడీ.. హైదరాబాద్ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లు

వేసవిలో విహార యాత్రలకు, పుణ్య క్షేత్రాల దర్శనానికి వెళ్ళాలి అనుకుంటున్న వారికీ ఐఆర్సీటీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనుంది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 19, 2026 1:39 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 వారం ago
Share
IRCTC Summer Tours

అక్షరటుడే, వెబ్​డెస్క్​: IRCTC Summer Tours | వేసవి సెలవుల్లో పర్యటనలు, తీర్థయాత్రలు చేయాలనుకునే వారి కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక సమ్మర్ టూర్ ప్యాకేజీలను తీసుకువచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల యాత్రికుల కోసం హైదరాబాద్ నుంచి నాలుగు ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్స్’ను నడపనుంది. ఇవి ఏప్రిల్ 28 నుంచి జూన్ 12 వరకు ఉంటాయి. ప్యాకేజీల వివరాలు ఇలా ఉన్నాయి.

Contents
  • IRCTC Summer Tours | ప్యాకేజీ-1 :
    • IRCTC Summer Tours | ప్యాకేజీ-2:
    • IRCTC Summer Tours | ప్యాకేజీ-3:
      • ప్యాకేజీ-4:
      • ఇవన్నీ ప్యాకేజీలో భాగంగానే..

IRCTC Summer Tours | ప్యాకేజీ-1 :

పూరి, కోణార్క్, బైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య, కాశి, ప్రయాగరాజ్ ప్రాంతాలు ఈ ప్యాకేజీలో కవర్‌ అవుతాయి. ఈ యాత్ర ఏప్రిల్ 28 న ప్రారంభమై మే 7 న ముగుస్తుంది. టికెట్ ధరలు స్లీపర్‌ క్లాస్‌ రూ. 16,700, ఏసీ(3ఏ) రూ. 26,100, ఏసీ(2ఏ) రూ.34,100. రైలు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా వెళ్తుంది. ఆయా ప్రాంతాల టూరిస్ట్‌లు ఈ రైలులో ఎక్కవచ్చు.

IRCTC Summer Tours | ప్యాకేజీ-2:

మధుర, బృందావన్, హరిద్వార్, వైష్ణోదేవి, రిషికేశ్ ప్రాంతాలు కవర్ చేస్తారు. ఈ యాత్ర మే 12 నుంచి మే 21 వరకు ఉంటుంది. స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.16,500, ఏసీ(3ఏ) రూ.25,700, ఏసీ(2ఏ) రూ.33,400. రైలు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై భువనగిరి, జనగాం, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హర్ష, నాగ్‌‌పూర్ మీదుగా ప్రయాణిస్తుంది.

IRCTC Summer Tours | ప్యాకేజీ-3:

ఇందులో అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరుచ్చి, తంజావూరు, చిదంబరం ప్రాంతాలు కవర్ అవుతాయి. యాత్ర మే 24 నుంచి మే 31 వరకు ఉంటుంది. స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.14,500, ఏసీ(3ఏ) రూ.21,700, ఏసీ(2ఏ) రూ.27,900 గా నిర్ణయించారు. రైలు సికింద్రాబాద్ నుంచి జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా వెళ్తుంది.

ప్యాకేజీ-4:

యమునా నది పుష్కరాల సందర్భంగా పూరి, కోణార్క్, బైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్, కాశీ యాత్రకు వెళ్ళాలి అనుకుంటున్న వారికోసం ఈ ప్యాకేజీ తీసుకువచ్చారు. ఈ యాత్ర జూన్ 3 నుంచి జూన్ 12 వరకు ఉంటుంది. స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.16,700, ఏసీ (3ఏ) రూ.26,100, ఏసీ (2ఏ) రూ.34,100గా ఉంది.

ఇవన్నీ ప్యాకేజీలో భాగంగానే..

ప్రయాణికులకు బ్రేక్‌‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, టీ, కాఫీ, స్నాక్స్, వాటర్ బాటిల్స్ అందిస్తారు. ఒక్కో యాత్రలో 30 మంది టూరిస్టులను ఒక గ్రూపుగా చేసి, వారికి ఇద్దరు గైడ్లు, ఒక రైల్వే అధికారి అందుబాటులో ఉంటారు.

ఇది కూడా చదవండి..: Kavitha New Party | కవిత కొత్త పార్టీ పేరు ఇదే..

Ayodhya Ram Mandir | అయోధ్యలో అద్భుతం.. బాలరాముడికి సూర్యతిలకం
Shivalik Gas Tanker | తీరనున్న గ్యాస్​ కష్టాలు.. నేడు గుజరాత్ తీరానికి శివాలిక్​ నౌక
Sukhoi Su-30 Crash | కూలిపోయిన సుఖోయ్​ యుద్ధ విమానం.. ఇద్దరు పైలెట్ల మృతి
Maharashtra Factory Explosion | మహారాష్ట్రలో భారీ పేలుడు.. 17 మంది మృతి
Lok Sabha Speaker | లోక్‌సభ స్పీకర్‌పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
TAGGED:Bharat Gaurav trainsHyderabad special trainsIndian railway tourismIRCTC packagesIRCTC summer tourspilgrimage tours Indiasummer travel Indiatrain tour packages
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Tadbund Hanuman Temple | భజనలు, కీర్తనలు.. జెన్​జీ కి శనివారం నైట్​ హబ్​గా తాడ్​బండ్​ హనుమాన్​ సన్నిధి! Tadbund Hanuman Temple | భజనలు, కీర్తనలు.. జెన్​జీ కి శనివారం నైట్​ హబ్​గా తాడ్​బండ్​ హనుమాన్​ సన్నిధి!
Next Article Ugadi Panchang Predictions | Ugadi Panchang Predictions | వారికి ఆ నాలుగు నెలలు నరకమే..
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?