అక్షరటుడే, వెబ్డెస్క్: IRGC Intelligence Chief | ఇరాన్ (Iran)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్–అమెరికా దాడుల్లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖదేమీ మృతి చెందారు. ఈమేరకు ఇరాన్ సోమవారం ప్రకటన విడుదల చేసింది.
ఇజ్రాయెల్ దాడిలో జనరల్ మొహమ్మద్ కజెమీ (General Mohammad Kazemi) మరణించిన తరువాత, జూన్ 2025లో ఖదేమీ IRGC ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా నియమితులయ్యారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో అప్పటి సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో సహా ఇప్పటివరకు 1,340 మందికి పైగా మరణించారు. సోమవారం ఉదయం జరిగిన వైమానిక దాడిలో ఖాదేమి మరణించినట్లు IRGC వెల్లడించింది.
IRGC Intelligence Chief | ఇరాన్ నాయకులే లక్ష్యంగా..
ఇజ్రాయెల్ (Israel) రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని ప్రకటించారు. రివల్యూషనరీ గార్డ్ పౌరులపై కాల్పులు జరుపుతోందని ఆయన పేర్కొన్నారు. తాము నాయకులను నిర్మూలిస్తున్నామని చెప్పారు. ఇరాన్ నాయకులు తమను లక్ష్యంగా చేసుకున్నారనే భావనతో జీవిస్తున్నారని, తాము వారిని ఒక్కొక్కరిగా వేటాడటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇరాన్ ఉక్కు, పెట్రోకెమికల్ పరిశ్రమలను కూడా ఇజ్రాయెల్ తీవ్రంగా దెబ్బతీసిందని కాట్జ్ తెలిపారు.
ఇది కూడా చదవండి..: US Iran Ceasefire | కాల్పుల విరమణ దిశగా అమెరికా, ఇరాన్
