అక్షరటుడే, హైదరాబాద్ : Edible Oil | మార్కెట్‌లో ఆవ, వేరుశనగ, సన్‌ఫ్లవర్, రైస్ బ్రాండ్ (Rice Bran) వంటి ఎన్నో రకాల వంట నూనెలు అందుబాటులో ఉన్నాయి. అయితే, దురదృష్టవశాత్తూ, ప్రీమియం నూనెల మాదిరిగా కనిపించడానికి రంగులు, హానికరమైన కెమికల్స్‌ను కలిపి కల్తీ నూనెలు విక్రయిస్తున్నారు. కల్తీ నూనె వాడటం వల్ల జీర్ణ సమస్యలు, కాలేయం దెబ్బతినడం, గుండె జబ్బులు (Heart Diseases) వంటి తీవ్రమైన అనారోగ్యాలు వస్తాయి. అందుకే, మనం వాడుతున్న నూనె స్వచ్ఛమైనదో, కల్తీదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ సులువైన చిట్కాలతో ఆ తేడాను కనిపెట్టి, ఆరోగ్యంగా ఉండవచ్చు.
Edible Oil | కల్తీ నూనెను గుర్తించడానికి సులభమైన చిట్కాలు:
ఆకృతి , స్థిరత్వం (టచ్ టెస్ట్):
స్వచ్ఛమైన నూనె : నూనెను చేతిలోకి తీసుకుని తాకితే, అది వేళ్లకు సాఫ్ట్‌గా, తేలికగా అనిపిస్తుంది.
కల్తీ నూనె : జిడ్డుగా, జిగటగా, లేదా బరువుగా అనిపిస్తే అనుమానించాలి. కల్తీ నూనె (Adulterated Oil)లలో ఉండే పారాఫిన్ లేదా మినరల్ ఆయిల్స్ కారణంగా ఇలా జిడ్డుగా ఉంటుంది. బొటనవేలు, చూపుడు వేలు మధ్య రుద్దినప్పుడు మైనపులా అనిపించినా, అవశేషాలు మిగిలినా అది కల్తీ నూనె కావచ్చు.
Edible Oil | సువాసనను పరీక్షించడం (అరోమా టెస్ట్):
స్వచ్ఛమైన నూనె : స్వచ్ఛమైన నూనెలకు చాలా ప్రత్యేకమైన, సహజమైన వాసన (Aroma) ఉంటుంది. ఉదాహరణకు, ఆవ నూనె ఘాటుగా, కొబ్బరి నూనె శుభ్రమైన, తీపి వాసనతో వస్తుంది.
కల్తీ నూనె : నకిలీ నూనెలు వాసన లేకుండా ఉంటాయి లేదా కృత్రిమ వాసన వస్తాయి. ఒక చెంచా నూనెను కొద్దిగా వేడిచేసి, సహజమైన సువాసన వస్తే స్వచ్ఛమైనదిగా, కాలిన లేదా కృత్రిమ వాసన వస్తే నకిలీదిగా భావించాలి.
Edible Oil | ఫ్రీజర్ పరీక్ష (గడ్డకట్టే పరీక్ష):
ఈ చిట్కా నకిలీ నూనెలను సులభంగా గుర్తిస్తుంది. కొద్ది మొత్తంలో నూనెను గాజు పాత్ర (Glass Container)లో తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టాలి.
స్వచ్ఛమైన నూనె : స్వచ్ఛమైన నూనె కొద్దిగా ‘క్లౌడీ’గా మారవచ్చు, కానీ పూర్తిగా గడ్డకట్టదు.
కల్తీ నూనె : కల్తీ నూనె పూర్తిగా గడ్డకట్టడం లేదా తెల్లటి బాల్స్‌గా మారుతుంది.
Edible Oil | లేబుల్ ,సోర్స్ తనిఖీ (FSSAI సర్టిఫికేషన్):
స్వచ్ఛమైన నూనె : స్వచ్ఛమైన, ధృవీకరించిన నూనెలపై FSSAI సర్టిఫికేషన్ ఉంటుంది. అలాగే, నూనెను ఎలా తయారు చేశారు (కోల్డ్ ప్రెస్డ్ లేదా ఎక్స్‌పెల్లర్ ప్రెస్డ్ వంటి వివరాలు), ఎక్కడ తయారైంది అనే సమాచారం స్పష్టంగా ముద్రిస్తారు.
కల్తీ నూనె : నకిలీ నూనెలు ఈ ముఖ్యమైన సమాచారాన్ని (తయారీ విధానం) ప్రింట్ చేయవు. బ్యాచ్ నంబర్లు, గడువు తేదీ (ఎక్స్‌పైరీ డేట్) వంటివి సరిగ్గా ఉన్నాయో లేదో గమనించాలి. అవి లేకపోతే, అనుమానించాలి.
Edible Oil | వాటర్ టెస్ట్ (నీటిలో పరీక్ష):
ఒక గ్లాసులో నీరు తీసుకుని, అందులో ఒక స్పూన్ నూనె పోసి కొంతసేపు వేచి చూడాలి.
స్వచ్ఛమైన నూనె : స్వచ్ఛమైన నూనె నీటిపై ఒకే విధంగా విస్తరించి, మిక్స్ అవ్వకుండా తేలుతుంది.
కల్తీ నూనె : కల్తీ నూనె నీటితో కలిసిపోవడం, బుడగలు లేదా అడ్డంగా గీతలు (స్ట్రీక్స్) ఏర్పడటం గమనించవచ్చు. ఈ తేడాను బట్టి వాడుతున్న నూనె స్వచ్ఛతను నిర్ధారించుకోవచ్చు.


