అక్షరటుడే, వెబ్‌డెస్క్: ISRO YUVIKA 2026 | విద్యార్థులు యువ సైంటిస్టులు ఎదగడానికి ఇస్రో ప్రోత్సాహం అందిస్తోంది. అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి ఉన్న పాఠశాల విద్యార్థుల కోసం ‘యువిక 2026’ను ప్రకటించింది. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు ప్రాథమిక అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పేర్కొన్నారు.
ISRO YUVIKA 2026 | ఎంపికైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
‘యువిక 2026’కు ఎంపికైన విద్యార్థులకు మే 11 నుండి మే 22 వరకు ఇస్రోకు సంబంధించిన కేంద్రాల్లో శాస్త్రవేత్తలతో శిక్షణ ఇవ్వనుంది. అయితే ఇందుకు సంబంధించిన ఖర్చులన్నింటినీ కూడా ఇస్రోనే భరించనుంది.
ISRO YUVIKA 2026 | మార్చి 31 దరఖాస్తుకు ఆఖరు తేదీ
ఇస్రో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 ఆఖరి తేదీగా నిర్ణయించింది. విద్యార్థుల ఎంపికకు మార్కులతోనే కాకుండా ఇతర పరీక్షలు సైతం నిర్వహించనుంది. 8వ తరగతి మార్కులతో పాటు ఆన్‌లైన్ క్విజ్, సైన్స్ ఫెయిర్స్, ఒలింపియాడ్స్, క్రీడల్లో వారి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 15 శాతం అదనపు వెయిటేజీ ఇవ్వనుంది. ‘యువిక 2026’ కోసం విద్యార్థులు ఇస్రో అధికారిక వెబ్‌సైట్ ‘అంతరిక్ష జిజ్ఞాస’ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి..: Railway Ticket Cancellation | రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్‌లో మార్పులు..

