Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: IT Job Layoffs | యుద్ధం – ఏఐ ప్రభావం.. ఇక ఐటీ ఉద్యోగాలు ఉండవా.. ఇప్పటికే భారీగా కోత.. నవంబర్​ తర్వాత ఏమి జరగబోతోంది!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - IT Job Layoffs | యుద్ధం – ఏఐ ప్రభావం.. ఇక ఐటీ ఉద్యోగాలు ఉండవా.. ఇప్పటికే భారీగా కోత.. నవంబర్​ తర్వాత ఏమి జరగబోతోంది!

అంతర్జాతీయంఎడ్యుకేషన్​ & జాబ్స్​జాతీయంటెక్నాలజీతాజా వార్తలు

IT Job Layoffs | యుద్ధం – ఏఐ ప్రభావం.. ఇక ఐటీ ఉద్యోగాలు ఉండవా.. ఇప్పటికే భారీగా కోత.. నవంబర్​ తర్వాత ఏమి జరగబోతోంది!

నవంబర్ తర్వాత ఐటీ రంగంలో restructuring, layoffs, skill-based hiring మరింత పెరగొచ్చని చెబుతున్నారు. ఇది ఎందుకు ఏమిటో సవివరంగా తెలుసుకుందాం..

Naresh chandan
Last updated: మార్చి 15, 2026 10:16 సా.
Naresh chandan
2 వారాలు ago
Share
IT Job Layoffs | యుద్ధం – ఏఐ ప్రభావం.. ఇక ఐటీ ఉద్యోగాలు ఉండవా.. ఇప్పటికే భారీగా కోత.. నవంబర్​ తర్వాత ఏమి జరగబోతోంది!
IT Job Layoffs | యుద్ధం – ఏఐ ప్రభావం.. ఇక ఐటీ ఉద్యోగాలు ఉండవా.. ఇప్పటికే భారీగా కోత.. నవంబర్​ తర్వాత ఏమి జరగబోతోంది!

అక్షరటుడే, హైదరాబాద్: IT Job Layoffs | ప్రపంచ పరిణామాలు, ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా మధ్య ఉద్రిక్తతలతో పాటు కృత్రిమ మేధస్సు (AI) వేగంగా విస్తరించడం వల్ల ఐటీ రంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా అనేక ఐటీ దిగ్గజ కంపెనీలు తమ సంస్థలను పునర్వ్యవస్థీకరించుకుంటూ ఉద్యోగులను భారీగా తగ్గిస్తున్నాయి.

Contents
  • IT Job Layoffs | భారీగా ఉద్యోగ కోతలు
    • IT Job Layoffs | ఏఏ కంపెనీలు ఎంతమందిని తొలగించాయంటే..
      •  IT Job Layoffs | ఏఐ ప్రభావం
      •  IT Job Layoffs | భారత ఐటీ రంగం పరిస్థితి..
      •  IT Job Layoffs | భవిష్యత్తులో మరిన్ని మార్పులు తప్పవా..
      • నవంబరు తర్వాత ఏమి  జరగబోతోంది..?

IT Job Layoffs | భారీగా ఉద్యోగ కోతలు

తాజా నివేదికల ప్రకారం 2026 ప్రారంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా పలు ఐటీ కంపెనీలు ఇప్పటికే 30 వేలకుపైగా ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. 2025లో అయితే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.45 లక్షల మంది టెకీలు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది.

IT Job Layoffs | ఏఏ కంపెనీలు ఎంతమందిని తొలగించాయంటే..

ఇటీవల ప్రముఖ టెక్ కంపెనీలు తీసుకున్న ఉద్యోగ కోతల వివరాలను పరిశీలిస్తే..

  • Amazon – దాదాపు 16,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది.
  • Microsoft – సుమారు 9,000 మంది ఉద్యోగులను తగ్గించింది.
  • Intel – సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 25 వేల వరకు ఉద్యోగాలు తగ్గించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
  • TCS (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) – దాదాపు 19,700 మందికి పైగా ఉద్యోగాలను తగ్గించింది.
  • Accenture – సుమారు 11,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు.
  • Atlassian – ఏఐ దిశగా మార్పుల నేపథ్యంలో 1,600 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.
  • Block (ఫిన్‌టెక్ కంపెనీ) – సుమారు 4,000 ఉద్యోగాలు తగ్గించినట్లు తెలిసింది.
  • WiseTech Global – దాదాపు 2 వేల మంది ఉద్యోగులు తొలగించబడ్డారు.
  • Livspace – సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వెయ్యి మంది ఉద్యోగాలను కోల్పోయారు.
  • ఒరాకిల్​ – ఇటీవలే ఆరు వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.

 IT Job Layoffs | ఏఐ ప్రభావం

ఐటీ రంగంలో జరుగుతున్న ఉద్యోగ కోతలకు ప్రధానంగా AI తోపాటు ఆటోమేషన్ కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పనులు చేయగలిగే టెక్నాలజీలపై కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే సంప్రదాయ ఐటీ ఉద్యోగాల అవసరం తగ్గుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

 IT Job Layoffs | భారత ఐటీ రంగం పరిస్థితి..

ప్రపంచ మార్కెట్ మందగమనంతో పాటు విదేశీ క్లయింట్ల ద్వారా వచ్చే ప్రాజెక్టులు తగ్గడం వల్ల భారత ఐటీ రంగం తీవ్ర ప్రభావానికి గురవుతోందని  చేస్తోంది. ఈ నేపథ్యంలో బడా ఐటీ కంపెనీలు సైతం కొత్త నియామకాలను తగ్గించి, కొన్నిచోట్ల ఉద్యోగులను తగ్గించే మార్గంలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది.

 IT Job Layoffs | భవిష్యత్తులో మరిన్ని మార్పులు తప్పవా..

కాగా, ఐటీ రంగంలో పూర్తిగా ఉద్యోగాలు తగ్గిపోవడం ఉండదని నిపుణులు చెబుతున్నారు. AI, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో కొత్త అవకాశాలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఈ లెక్కన సాంకేతిక మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపర్చుకోకుంటే.. భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.akshara job cut

నవంబరు తర్వాత ఏమి  జరగబోతోంది..?

నవంబర్‌ తర్వాత ఐటీ రంగంలో మరిన్ని మార్పులు రావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకు కొన్ని కారణాలు లేకపోలేదు. ఇందులో ప్రపంచ పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, AI ప్రభావం, కంపెనీల బడ్జెట్ సైకిల్ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.

కొత్త బడ్జెట్ సైకిల్

  • అంతర్జాతీయంగా చాలా ఐటీ కంపెనీల ఫైనాన్షియల్ ఇయర్ (FY) అక్టోబరు – నవంబరు ప్రారంభమవుతాయి. అంటే ఆ సమయానికి కొత్త ప్రాజెక్ట్ ప్లానింగ్‌ ప్రారంభిస్తాయన్నమాట.
  • ఈ క్రమంలోనే పలు ఐటీ కంపెనీలు వచ్చే ఏడాది ఖర్చులు తగ్గించేందుకు ముందుగానే ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం లేదా బృందాలను రీస్ట్రక్చర్ చేయడం వంటివి చేపడతాయి.
  • అందుకే నవంబరు నుంచి layoffs కానీ, restructuring కానీ ఎక్కువగా ఉంటాయి.

AI – ఆటోమేషన్ వేగం: 

  • 2025 – 26లో AI టెక్నాలజీలు చాలా వేగంగా అభివృద్ధి చెందాయి. ఇంకా కొత్తవి వస్తూనే ఉన్నాయి.
  • కోడింగ్, డేటా అనాలిసిస్, టెస్టింగ్ వంటి పనుల్లో AI tools ఎక్కువగా వినియోగిస్తున్నారు.
  • ఒకప్పుడు 10 మంది ఉద్యోగులు చేసే పని.. ఇప్పుడు 3–4 మంది + AIతో చేయించే పరిస్థితి వచ్చింది.
    దీంతో కొన్ని సంప్రదాయ ఐటీ ఉద్యోగాల అవసరం తగ్గుతున్నట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం

భారత ఐటీ రంగానికి ప్రధానంగా అమెరికా, యూరప్ నుంచి ప్రాజెక్టులు వస్తాయి. అయితే అక్కడి కంపెనీలు ప్రస్తుతం మాంద్యం భయం, వడ్డీ రేట్లు, జియోపాలిటికల్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో తమ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ప్రాజెక్టులు తగ్గితే భారత ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం తప్పదు.

జియోపాలిటికల్ ఉద్రిక్తతలు

మధ్యప్రాచ్యంలో ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా యుద్ధ ఉద్రిక్తతలు.. ప్రపంచ మార్కెట్లను అస్థిరంగా చేస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారులు టెక్ ప్రాజెక్టులపై ఖర్చు తగ్గించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలు తమ వ్యూహాలు మార్చుకుంటున్నాయి.

HMPV Virus | అమెరికాపై మరో ప్రమాదకర వైరస్​ పంజా.. వేగంగా విస్తరిస్తున్న HMPV!
Kavitha Siddipet Contest | సిద్ధిపేట నుంచి కల్వకుంట్ల కవిత పోటీకి దిగనుందా.. నెట్టింట వైరల్​!
Inter Exams | రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు..
IDFC Bank Fraud | రూ. 590 కోట్ల మోసం.. రూ. 900 కోట్ల నష్టం
KA Paul Iran Israel War | వారంలో యుద్ధం ముగుస్తుంది : కేఏ పాల్
TAGGED:AI impact on jobsAI jobs futureautomation job cutsglobal tech companies layoffsIT industry newsIT job layoffstech industry restructuringtech layoffs 2026
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article RSS Ugadi Utsavam | RSS Ugadi Utsavam | 19న ఆర్ఎస్ఎస్ ఉగాది ఉత్సవం
Next Article Putta Mahesh | డ్రగ్స్​ ఆరోపణలపై పార్టీ అధిష్ఠానం సీరియస్​.. ఎంపీ పుట్టా వివరణ! Putta Mahesh | డ్రగ్స్​ ఆరోపణలపై పార్టీ అధిష్ఠానం సీరియస్​.. ఎంపీ పుట్టా వివరణ!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?