అక్షరటుడే, కామారెడ్డి: IVF Services Praised | ఐవీఎఫ్ సంస్థ చేపడుతున్న సేవలు అభినందనీయమని జిల్లా న్యాయసేవల సంస్థ కార్యదర్శి టి.నాగరాణి తెలిపారు. ఐవీఎఫ్ ఆధ్వర్యంలో జీజీహెచ్‌లో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (Women’s Day) పురస్కరించుకుని నవజాత శిశువుల కోసం ప్రత్యేక కిట్స్‌ను శిశువుల తల్లులకు పంపిణీ చేశారు.
IVF Services Praised | పిల్లలు దేవుళ్లతో సమానం..
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా న్యాయసేవల సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ.. పిల్లలు దేవుళ్లతో సమానమని పేర్కొన్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడం మన బాధ్యత అని తెలిపారు. అప్పుడే వాళ్లు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఐవీఎఫ్ సంస్థను (IVF Center) అభినందించారు. ఐవీఎఫ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఐవీఎఫ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా రూ.1,600 విలువైన 40 కిట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వీణ, తహశీల్దార్ హిమబిందు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్ రావు, ఐవీఎఫ్ అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్ గుప్తా, కోశాధికారి వెంకటేష్ గుప్తా, మహిళా విభాగం అధ్యక్షురాలు నీల రజిని, కార్యదర్శి చిలువేరి శ్రీదేవి, కోశాధికారి గజవాడ అన్నపూర్ణ, యువజన నాయకులు ఈశ్వర్ గుప్తా చరణ్, ప్రవీణ్, నికిల్, కొత్త సంగరాజు గుప్తా, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Girls Missing | బాలసదనం నుంచి ఇద్దరు బాలికల అదృశ్యం.. కామారెడ్డిలో ఘటన

