Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Jagjivan Ram Jayanti | ఉమ్మడి జిల్లాలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Jagjivan Ram Jayanti | ఉమ్మడి జిల్లాలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

నిజామాబాద్

Jagjivan Ram Jayanti | ఉమ్మడి జిల్లాలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

ఉమ్మడిజిల్లాలో బాబు జగ్జీవన్​ రామ్​ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 5, 2026 11:32 ఉద.
Shashi kiran Mottala
19 గంటలు ago
Share
Jagjivan Ram Jayanti |
Jagjivan Ram Jayanti | ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

అక్షరటుడే, నెట్​వర్క్​ : Jagjivan Ram Jayanti | ఉమ్మడిజిల్లాలో బాబు జగ్జీవన్​ రామ్​ జయంతిని (Babu jagjivan ram jayanti) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Contents
  • Jagjivan Ram Jayanti | జిల్లా కేంద్రంలో..
    • Jagjivan Ram Jayanti | బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో..
      • Jagjivan Ram Jayanti | భీమ్​గల్​ మండలంలోని చేంగల్​​లో..
      • Jagjivan Ram Jayanti | ఎల్లారెడ్డిలో..
      • ఆర్మూర్​లో..

Jagjivan Ram Jayanti | జిల్లా కేంద్రంలో..

జిల్లా కేంద్రంలోని రైల్వే కమాన్​ వద్ద బాబు జగ్జీవన్ విగ్రహానికి ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ (Mla Dhanpal) ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కలెక్టర్​ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi), వ్యవసాయ కమిషన్​ సభ్యుడు గడుగు గంగాధర్​ తదితరులు పాల్గొన్నారు.​

Jagjivan Ram Jayanti | బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో..

bc

దేశానికి బాబు జగ్జీవన్​ రామ్​ చేసిన సేవలు చిరస్మరణీయమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్​ అన్నారు. ఈ మేరకు ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రక్షణ మంత్రిగా పాకిస్తాన్​పై విజయం, వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవం, కార్మిక శాఖ మంత్రిగా కార్మికులకు హక్కులు.. ఇలా దేశాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన చేసిన కృషి వెలకట్టలేమన్నారు. భారతదేశం ఒక పుస్తకం అయితే దాని ముఖచిత్రం బాబు జగ్జీవన్ రామ్ అని సుధాకర్​ అన్నారు. కార్యక్రమంలో బుస్సా ఆంజనేయులు, మాడవేడి వినోద్ కుమార్, శ్రీలత , నారాయణ రెడ్డి, రేఖ, రుక్మిణి, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

Jagjivan Ram Jayanti | భీమ్​గల్​ మండలంలోని చేంగల్​​లో..

bhh1

అక్షరటుడే, భీమ్​గల్: మండలంలోని చేంగల్ గ్రామంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను(bheemgal news) ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ దుమ్మాల మమత రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. దేశానికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాతి మోహన్ గౌడ్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, వివిధ దళిత సంఘాల నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు, స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Jagjivan Ram Jayanti | ఎల్లారెడ్డిలో..

yeallareddy

అక్షరటుడే, ఎల్లారెడ్డి: పట్టణంలోని(Yellareddy) ఎస్సీ వసతి గృహంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వార్డెన్ విఠల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశానికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆర్మూర్​లో..

armoor1

ఆర్మూర్ పట్టణంలో బాబు జగ్జీవన్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మున్సిపల్ ఛైర్​పర్సన్ గోనె లహరి

armoor22

ఆర్మూర్​ మండలం గోవింద్​పేటలో..

 

ఇది కూడా చదవండి: American Pilot Rescue | ఇరాన్​లో అమెరికన్​ పైలెట్​ సేఫ్​.. అతడిని రక్షించినట్లు ట్రంప్​ ప్రకటన

Village development cooperation | పరస్పర సహకారంతోనే గ్రామాల అభివృద్ధి: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య
Mission Bhagiratha Water Supply | ఐదురోజుల పాటు మిషన్​ భగీరథ నీటిసరఫరా నిలిపివేత
Women Federation Buildings | 114 గ్రామాలకు మహిళా సమాఖ్య భవనాలు మంజూరు
Red Sorghum Farmers Demand | ఎర్రజొన్న విత్తనాలు ఇచ్చిన వ్యాపారులే కొనుగోలు చేయాలి
RSS Ugadi Utsavam | 19న ఆర్ఎస్ఎస్ ఉగాది ఉత్సవం
TAGGED:Babu jagjivan ram jayantibheemgal newsCollector Ila Tripathidalit leader tributeindian leadersjagjivan ram jayantiMLA Dhanpalsocial leaders indiaYellareddyYellareddy events
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article American Pilot Rescue American Pilot Rescue | ఇరాన్​లో అమెరికన్​ పైలెట్​ సేఫ్​.. అతడిని రక్షించినట్లు ట్రంప్​ ప్రకటన
Next Article Ranganayaka Sagar Ranganayaka Sagar | రంగనాయక సాగర్​లోకి ఎత్తిపోతలు ప్రారంభం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?