అక్షరటుడే, వెబ్డెస్క్: Jal Jeevan Mission Extension | కేంద్ర మంత్రివర్గం (Union Cabinet) మంగళవారం భేటీ అయ్యింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ విమానయాన సౌకర్యాలను మరింత బలోపేతం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత నీటి సరఫరాపై కేబినెట్ చర్చించింది.
సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Union Minister Ashwini Vaishnav) మీడియాతో మాట్లాడారు. తమిళనాడులోని మదురై విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు ఇచ్చే ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించిందని వెల్లడించారు. అలాగే జల్ జీవన్ మిషన్‌ను డిసెంబర్ 2028 వరకు పొడిగించడానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.
Jal Jeevan Mission Extension | మదురై ఎయిర్పోర్టుకు అంతర్జాతీయ హోదా
తమిళనాడు (Tamil Nadu)లోని ప్రాచీన విమానాశ్రయాల్లో మదురై ఒకటి. దక్షిణ తమిళనాడు ప్రాంతంలో ముఖ్యమైన నగరం ఇది. దీంతో ఈ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించడం ద్వారా ప్రాంతీయ అంతర్జాతీయ సంబంధాలు బలపడతాయని ప్రభుత్వం భావించింది. దీంతో దీనిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయనున్నారు. మదురై, సమీప ప్రాంతాల్లో ప్రముఖ ఆలయాలు, పర్యాటల ప్రాంతాలు ఉన్నాయి. దీనిని అభివృద్ధి చేయడం వల్ల పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందనుంది. అలాగే స్థానిక వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలు మరింత ఊపందుకుంటాయని అధికారులు వివరించారు.

Jal Jeevan Mission Extension | 2028 డిసెంబర్ వరకు జల్ జీవన్ మిషన్
కేంద్ర మంత్రివర్గం జల్ జీవన్ మిషన్ (Jal Jeevan Mission)ను డిసెంబర్ 2028 వరకు పొడిగించింది. అలాగే ఆర్థిక సహాయాన్ని కూడా పెంచింది. గ్రామీణ ప్రాంతాలను సురక్షిత తాగునీటి అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలుచేస్తోంది. గ్రామాల్లో స్థిరమైన నీటి సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం, సేవల నాణ్యతను మెరుగుపరచడం, దీర్ఘకాలిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం వంటి అంశాలపై దృష్టి సారించనుంది.
ఇది కూడా చదవండి..: Lok Sabha No Confidence | లోక్‌సభ స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై చర్చ

