Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Jana Sena MLA | జనసేన ఎమ్మెల్యేపై మనీ లాండరింగ్ ఆరోపణలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Jana Sena MLA | జనసేన ఎమ్మెల్యేపై మనీ లాండరింగ్ ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్​

Jana Sena MLA | జనసేన ఎమ్మెల్యేపై మనీ లాండరింగ్ ఆరోపణలు

జనసేన ఎమ్మెల్యే లోకం మాధవిపై మనీ లాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. విచారణ జరపాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 4, 2026 7:36 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Jana Sena MLA

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jana Sena MLA | జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి (MLA Madhavi)పై మనీ లాండరింగ్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. ఆమె సంస్థలో పని చేసిన ఓ మాజీ ఉద్యోగి ఈ మేరకు ఈసీ ఫిర్యాదు చేశారు.

జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారం ఇప్పటికే పార్టీ తీవ్ర నష్టం చేకూర్చింది. ఈ క్రమంలో మరో ఎమ్మెల్యేపై ఆరోపణలు రావడం గమనార్హం. లోకం నాగమాధవి నెల్లిమర్ల (Nellimarla) నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆమెకు ‘మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్’ అనే సంస్థ ఉంది. దాని ద్వారా ఆమె ఎన్నికల సమయంలో భారీగా నగదు మళ్లించారని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఫిర్యాదు అందడంతో ఎన్నికల సంఘం సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, జిల్లా కలెక్టర్‌ను ఈసీ ఆదేశించింది.

Jana Sena MLA | ఉద్యోగుల ఖాతాల నుంచి..

అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాగమాధవి తన సంస్థలోని ఉద్యోగుల ఖాతాలను నగదు మళ్లింపు కోసం వాడుకున్నట్లు మాజీ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు సుమారు 300 మంది ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలను వినియోగించుకున్నట్లు ఆరోపించారు. ఉద్యోగుల జీతాలతో పాటు అదనంగా రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు ఖాతాల్లో జమ చేశారని, దానిని తిరిగి ఆమె మనుషులు వసూలు చేసి ఎన్నికల కోసం ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సాక్ష్యాధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యేపై ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం సైతం సీరియస్​ కావడంతో ఆమె ఇరకాటంలో పడ్డారు. ఈ ఆరోపణలు నిజమని తేలితే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

దీనిని కూడా చదవండి : Andhra Pradesh New Map | ఏపీ కొత్త మ్యాప్​ విడుదల

Polavaram Tiger Alert | కాకినాడ నుంచి పోలవరం వ‌ర‌కు పెద్దపులి సంచారం.. గ్రామాల్లో భయాందోళనలు, అటవీ శాఖ అప్రమత్తం
Putta Mahesh | డ్రగ్స్​ ఆరోపణలపై పార్టీ అధిష్ఠానం సీరియస్​.. ఎంపీ పుట్టా వివరణ!
Rampa Chodavaram Tiger | మన్యంలో పెద్దపులి సంచారం.. రంపచోడవరం ప్రాంతంలో భయాందోళన
YS Jagan Corruption Allegations | రాష్ట్రంలో భారీగా అవినీతి : వైఎస్​ జగన్​
Badam Milk Incident | జాతరలో విక‌టించిన బాదం పాలు.. 80 మందికి అస్వస్థత, ఆసుపత్రుల్లో చికిత్స
TAGGED:Andhra Pradesh politicselection commission probeJana Sena MLALokam Madhavimoney laundering allegations
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Gajwel Political Tension Gajwel Political Tension | గజ్వేల్​లో హైటెన్షన్​ .. సీఎం ఫొటో తొలగించిన బీఆర్​ఎస్​ నాయకులు
Next Article Cervical Cancer Vaccine | Cervical Cancer Vaccine | ప్రతి అమ్మాయి క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?