అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jananayagan Scenes Leaked | ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్ కు తన కొత్త సినిమా ‘జన నాయగన్’ (Jananayagan) విషయంలో ఊహించని షాక్ తగిలింది. ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో (Social Media) లీక్ కావడం చిత్ర యూనిట్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
సుమారు ఐదు నిమిషాల నిడివి గల సన్నివేశంతో పాటు, సినిమాలోని ఒక పాట కూడా ఇంటర్నెట్‌లోకి రావడంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అయింది. ఈ లీక్ కారణంగా సినిమా కథలోని ముఖ్యమైన భాగాలు బయటపడే ప్రమాదం ఉండడంతో, మేకర్స్ వెంటనే చర్యలు తీసుకున్నారు.
Jananayagan Scenes Leaked | వీడియోలు తొలగించే పనిలో పోలీసులు..
ఈ ఘటనపై చిత్ర బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ లీక్ ఎలా జరిగింది? ఎవరు దీనికి కారణం? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. అదే సమయంలో సైబర్ క్రైమ్ విభాగం (Cyber Crime Division) లీక్ అయిన వీడియోలను తొలగించే పనిలో నిమగ్నమైంది. మరోవైపు ఈ సినిమాకు ప్రారంభం నుంచే అడ్డంకులు ఎదురవుతున్నాయి. వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా, కోర్టు కేసులు, సెన్సార్ సమస్యల కారణంగా పలుమార్లు వాయిదా పడింది. దీంతో అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది.
Jananayagan Scenes Leaked | సన్నివేశాల లీక్ కలకలం
ఇది విజయ్ (Vijay) కెరీర్‌లో చివరి సినిమా కావచ్చనే ప్రచారం నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ గత మూడు నెలలుగా వరుస వివాదాలు ఈ సినిమాను చుట్టుముట్టడం గమనార్హం. ఇప్పుడు సన్నివేశాల లీక్ ఘటన మరింత కలకలం రేపుతోంది. అయితే అన్ని అడ్డంకులను అధిగమించి ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి పైరసీ సమస్యలు (Piracy Issues) రావడం చిత్ర యూనిట్‌కు తలనొప్పిగా మారింది. లీకైన సన్నివేశాలు చూసిన కొందరు అచ్చు భగవంతి కేసరీని దింపేశారని కామెంట్ చేస్తున్నారు. కాగా, జననాయగన్.. భగవంత్ కేసరి రీమేక్ అంటూ కొన్నాళ్ళుగా ప్రచారం జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి..: Allu Arjun Raaka First Look | సగం మనిషి.. సగం మృగం.. “రాకా”గా షాక్ ఇచ్చిన అల్లు అర్జున్.. అట్లీ ప్లాన్ ఏంటి?
