అక్షరటుడే, అమరావతి: Janani Yatra | సంతానలేమి సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఓయాసిస్ ఫెర్టిలిటీ (Oasis Fertility) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దేశవ్యాప్త ఉద్యమం ‘జనని యాత్ర’ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని రాజమండ్రికి చేరుకుంది. గత ఐదు నెలలుగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర సహా ఎనిమిది రాష్ట్రాల్లో విజయవంతంగా పర్యటించిన ఈ యాత్ర, ప్రస్తుతం టైర్ 1, 2, 3 నగరాల్లోని ప్రజలకు అత్యాధునిక సంతానోత్పత్తి వైద్య విజ్ఞానాన్ని చేరవేస్తోంది.
శనివారం రాజమండ్రి (Rajahmundry)లో జరిగిన ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (MLA Adireddy Srinivas) ముఖ్య అతిథిగా హాజరై యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (TFR) తగ్గుతున్న తరుణంలో ప్రజల వద్దకే వైద్య సేవలను తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. శాస్త్రీయ దృక్పథంతో దంపతులకు భరోసా కల్పిస్తున్న ఓయాసిస్ ఫెర్టిలిటీ కృషిని ఆయన ప్రశంసించారు.
Janani Yatra | ఉచిత పరీక్షలు నిపుణుల సలహాలు
ఈ యాత్రలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన బస్సు ద్వారా దంపతులకు ఉచిత సంతానోత్పత్తి సంప్రదింపులతో పాటు ఏఎంహెచ్ (AMH), హిమోగ్లోబిన్ వీర్య కణాల విశ్లేషణ వంటి ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఆధునిక జీవనశైలి మార్పులు అవగాహన లోపం వల్ల సంతానలేమి సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో, దంపతులు సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ యాత్ర మార్గదర్శకత్వం వహిస్తోంది.
Janani Yatra | వైద్య నిపుణుల సందేశం
ఓయాసిస్ ఫెర్టిలిటీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా జి.రావు మాట్లాడుతూ, అట్టడుగు వర్గాలకు కూడా సాక్ష్యాధారిత వైద్య సమాచారాన్ని అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సీఈఓ పుష్కరాజ్ షెనాయ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ గంగా ప్రియదర్శిని మాట్లాడుతూ, ఈ ఏడాది కాలంగా యాత్రకు లభిస్తున్న స్పందన అద్భుతంగా ఉందని, స్థానిక ప్రజలకు అత్యాధునిక చికిత్సల పట్ల అవగాహన కల్పించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. రాజమండ్రి నుండి ఈ యాత్ర రాబోయే రోజుల్లో జగ్గంపేట, దేవరపల్లి, రావులపాలెం వంటి ప్రాంతాలకు తరలనుంది.
ఇది కూడా చదవండి..: Vijayasai Reddy Media | మీడియా రంగంలోకి మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి
