అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jasprit Bumrah Injury | ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుండగా, క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ మెగా టోర్నీ కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. మార్చి 28 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru), సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్లు తలపడనున్నాయి.
దీంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ అభిమానులకు మాత్రం షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయపడ్డాడనే వార్తలు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఆయన బెంగళూరులోని బీసీసీఐ (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సందర్శించినట్లు సమాచారం రావడంతో ఈ అనుమానాలు మరింత పెరిగాయి.
Jasprit Bumrah Injury | బుమ్రా గాయం నిజమేనా?
ప్రస్తుతం బుమ్రా బెంగళూరులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన గాయం కారణంగా అక్కడికి వెళ్లాడా, లేక సాధారణ ఫిట్‌నెస్ చెక్ కోసం వెళ్లాడా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ నేపథ్యంలో బుమ్రా ఇంకా జట్టుతో ప్రాక్టీస్‌లో చేరలేదన్న వార్తలు అభిమానుల్లో ఆందోళనకు దారితీశాయి. కొన్ని నివేదికల ప్రకారం, ఒకవేళ బుమ్రా గాయం నిజమైతే, ఐపీఎల్ 2026 ప్రారంభ దశలో కొన్ని మ్యాచ్‌లకు అతడు దూరం కావాల్సి వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇది ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగానికి పెద్ద దెబ్బ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Jasprit Bumrah Injury | ట్రోఫీ గెలవడమే మా లక్ష్యం
ఇక జట్టు హెడ్ కోచ్ మహేల జయవర్ధనే (Mahela Jayawardene) ఇటీవల స్పందిస్తూ, ప్రపంచ కప్‌లో పాల్గొన్న భారత ఆటగాళ్లకు అదనపు విశ్రాంతి ఇచ్చామని తెలిపారు. “ప్రతి సంవత్సరం ట్రోఫీ గెలవడమే మా లక్ష్యం. వరల్డ్ కప్ ఆడిన ప్లేయర్లకు కొంత బ్రేక్ ఇచ్చాం. తద్వారా వారు తాజాగా తిరిగి జట్టుతో కలుస్తారు. తొలి మ్యాచ్‌కు ముందు అందరూ వారం రోజుల పాటు ఇంటెన్స్ ప్రాక్టీస్ చేస్తారు” అని ఆయన చెప్పారు. ముంబై ఇండియన్స్ తమ ఐపీఎల్ 2026 ప్రచారాన్ని మార్చి 29న ప్రారంభించనుంది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)తో తలపడనుంది. ఈ మ్యాచ్ చారిత్రాత్మకమైన వాంఖడే స్టేడియంలో జరగనుంది.
ఇది కూడా చదవండి..: Ishan Kishan SRH | SRH ప్రాక్టీస్ మ్యాచ్‌లో హీటెక్కిన సన్నివేశం.. కెప్టెన్‌నే గెటౌట్ అంటూ సైగ చేసిన యువ క్రికెటర్

