అక్షరటుడే, ఎల్లారెడ్డి: Jeevadhan School | కిండర్‌గార్టెన్ గ్రాడ్యుయేషన్ వేడుకలను (kindergarten graduation) జీవదాన్ పాఠశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. చిన్న పిల్లల ప్రాథమిక విద్యాభ్యాసాన్ని (Yellareddy news) పూర్తి చేసుకున్నందుకు గుర్తింపుగా, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా కిండర్‌గార్టెన్ గ్రాడ్యుయేషన్ వేడుకను ఘనంగా నిర్వహించారు.
Jeevadhan School | అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
ఈ వేడుకల్లో పిల్లలు గ్రాడ్యుయేషన్ గౌన్లు, (school events india) టోపీలు ధరించి, తమ ప్రతిభను ప్రదర్శించారు. వేడుకల్లో చిన్నారులు చేసిన సాంస్కృతిక (school celebrations) కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు, ఉపన్యాసాలు, వారు నేర్చుకున్న అంశాలను చెబుతూ చేసిన ప్రతిభ కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా (Yellareddy Municipality) మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్, కమిషనర్ మహేష్, వార్డుల కౌన్సిలర్లు, నాయకులు విద్యాసాగర్, రఫీక్, శ్యాం, ఫాదర్ జోబిష్ తదితరులు చిన్నారుల ప్రదర్శనలు తిలకించి ప్రశంసించారు. అనంతరం పిల్లలకు డిప్లొమాలు, సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జీవదాన్ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


