అక్షరటుడే, ఆర్మూర్: Jeevan Reddy Birthday | ఆర్మూర్ (Armoor Politics) మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జీవన్ రెడ్డి (Jeevan Reddy) జన్మదిన వేడుకలను శనివారం ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌లు కట్‌చేసి పలువురికి పంచిపెట్టారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
Jeevan Reddy Birthday|మాజీ సీఎం ఆశీర్వాదం తీసుకున్న జీవన్ రెడ్డి..
జీవన్ రెడ్డి తన జన్మదినం (Telangana Political Leaders) సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌ను (KCR) కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీమంత్రి హరీష్ రావును (Harish Rao) కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావులు జీవన్ రెడ్డికి జన్మదిన (Birthday Celebrations) శుభాకాంక్షలు తెలిపారు.
Jeevan Reddy Birthday | జనంలోకి జీవన్ రెడ్డి..
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి తనదైన శైలిలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ఆర్మూర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆయన అనంతరం నియోజకవర్గ సమస్యలపై దృష్టిపెట్టారు. కొన్ని నెలల నుంచి ఆర్మూర్‌లో ‘జనతా గ్యారేజ్’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా ధర్నాలు, ఆందోళన చేపడుతూ ప్రజలకు చేరువవుతున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పార్టీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.

ఇది కూడా చదవండి: Indiramma houses second phase | ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన.. ఏప్రిల్ 1 నుంచి రెండో విడత

