Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Jeevan Reddy joins BRS | 20న బీఆర్​ఎస్​లోకి జీవన్​రెడ్డి.. కాంగ్రెస్​పై సంచలన వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Jeevan Reddy joins BRS | 20న బీఆర్​ఎస్​లోకి జీవన్​రెడ్డి.. కాంగ్రెస్​పై సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ

Jeevan Reddy joins BRS | 20న బీఆర్​ఎస్​లోకి జీవన్​రెడ్డి.. కాంగ్రెస్​పై సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి జీవన్​రెడ్డి సీఎం రేవంత్​రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం తిరోగమనంలో ఉందన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 10, 2026 8:06 సా.
Srinivas Kolluri
7 గంటలు ago
Share
Jeevan Reddy joins BRS

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jeevan Reddy joins BRS | మాజీ మంత్రి జీవన్​రెడ్డి బీఆర్​ఎస్​ (BRS)లో​ చేరికకు ముహూర్తం ఫిక్స్​ అయింది. ఈ నెల 20న ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు.

Contents
  • Jeevan Reddy joins BRS | కాంగ్రెస్​ పట్టు కోల్పోయింది
    • Jeevan Reddy joins BRS | కేసీఆర్​ రావాలి

బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ (KCR)​ సమక్షంలో జీవన్​రెడ్డి పార్టీలో చేరతారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్​ తెలిపారు. జగిత్యాలలో భారీ బహిరంగ సభలో చేరిక కార్యక్రమం ఉంటుందన్నారు. రాష్ట్రంలో రైతు సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై ఈ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కేసీఆర్‌తో కలిసి పని చేయడానికి జీవన్ రెడ్డి ముందుకు వచ్చారని చెప్పారు. ఆయనకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు.

Jeevan Reddy joins BRS | కాంగ్రెస్​ పట్టు కోల్పోయింది

జీవన్​రెడ్డి శుక్రవారం కేసీఆర్​తో భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్​రెడ్డి, కాంగ్రెస్​ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై పట్టు కోల్పోయిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనంలో ఉందని విమర్శించారు. ఒకప్పుడు PCC చెప్పినట్టు సీఎం నడుచుకునేవారని, నేడు సీఎం చెబితే PCC అమలు చేస్తోందని ఆరోపించారు. PCC తప్పు చేసి నింద AICCపై వేస్తోందన్నారు.

Jeevan Reddy joins BRS | కేసీఆర్​ రావాలి

రేవంత్​రెడ్డి (Revanth Reddy) పోయి కేసీఆర్​ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని జీవన్​రెడ్డి అన్నారు. పదవుల కోసమే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాలంటే తాను బీఆర్​ఎస్​ అధికారంలో ఉన్న రోజే వెళ్ళేవాడినని చెప్పారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చనందుకు, ప్రజల పక్షాన పోరాడేందుకు తాను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నానని వెల్లడించారు. రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో మొదలైందన్నారు.

ఇది కూడా చదవండి : She Nethra Teams | మహిళల భద్రతకు చర్యలు.. షీ నేత్ర బృందాల ఏర్పాటు

Licensed Surveyors Wages | వేతనాలు లేక అవస్థలు.. కేటీఆర్‌ను కలిసిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు
Middle East War | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ‘హాహాకారాలు.. ఆర్తనాదాలు..’
Musi River Buildings | మూసీలో కడుతున్న బంగ్లాలు ఎందుకు కనిపించడంలేదు.. హైడ్రాపై కవిత ఆగ్రహం..
Drugs Test | డ్రగ్స్​ టెస్టులకు నేను రెడీ : కేటీఆర్​
Employee Pending Bills Release | ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. పెండింగ్​ బిల్లుల విడుదల
TAGGED:BRS joiningCongress PartyIndian PoliticsJeevan ReddyKCRparty switchRevanth ReddyTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Young India Integrated Schools | Young India Integrated Schools | యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​ స్కూళ్లతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు
Next Article Perkit Mahila Pranganam | Perkit Mahila Pranganam | పెర్కిట్ మహిళా ప్రాంగణం ఉదంతంపై కలెక్టర్ సీరియస్.. బాధ్యులపై చర్యలకు ఆదేశం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?