అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jeevan Reddy Meet | మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వెళ్లనున్నారు. జగిత్యాల (Jagtial)లోని ఆయన నివాసంలో గురువారం భేటీ కానున్నారు.
సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్ (Congress) పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరడం.. పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కకపోవడంతో జీవన్‌రెడ్డి హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేసే సమయంలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనపై పోరాటం చేస్తానని తెలిపారు. అయితే తాను ఏ పార్టీలో చేరేది ఆయన ఇంతవరకు ప్రకటించలేదు.
Jeevan Reddy Meet | బీఆర్ఎస్లోకి ఆహ్వానం
కేటీఆర్ రేపు మధ్యాహ్నం మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలవనున్నారు. ఆయనను బీఆర్ఎస్లోకి ఆహ్వానించనున్నారు. కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు. బుధవారం కేటీఆర్ ఆయనతో ఫోన్లో మాట్లాడారు. దీంతో పార్టీలోకి వచ్చేందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇంటికి వెళ్లి కేటీఆర్ ఆహ్వానించనున్నారు. అనంతరం జీవన్‌రెడ్డి త్వరలో మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరుతారని తెలుస్తోంది. పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని ఆయనకు కేటీఆర్ హామీ ఇచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి : Harish Rao Letter | ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కు హరీశ్‌రావు లేఖ
