Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Jeevan Reddy Resignation | కాంగ్రెస్​కు రాజీనామా చేసిన జీవన్​రెడ్డి.. రేవంత్​రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Jeevan Reddy Resignation | కాంగ్రెస్​కు రాజీనామా చేసిన జీవన్​రెడ్డి.. రేవంత్​రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు

తెలంగాణతాజా వార్తలు

Jeevan Reddy Resignation | కాంగ్రెస్​కు రాజీనామా చేసిన జీవన్​రెడ్డి.. రేవంత్​రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి జీవన్​రెడ్డి కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం రేవంత్​రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 25, 2026 1:25 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Jeevan Reddy Resignation

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jeevan Reddy Resignation | మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు జీవన్​రెడ్డి కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేశారు. అనుచరులు, మద్దతుదారుల సమక్షంలో రాజీనామా లేఖను విడుదల చేశారు.

Contents
  • Jeevan Reddy Resignation | బాధతో పార్టీని వీడుతున్నా..
    • Jeevan Reddy Resignation | రేవంత్​రెడ్డిని ఎదిరించి పోరాటం చేస్తా
      • Jeevan Reddy Resignation | వారికే పదవులు
        • Jeevan Reddy Resignation | ఎంతమందిని తొక్కుతావు

జీవన్​రెడ్డి కొంతకాలంగా అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ (Jagtial MLA Sanjay Kumar)కు ప్రాధాన్యత ఇచ్చి, తనను పట్టించుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పార్టీ మారుతానని ప్రకటించారు. మంత్రులు, ఏఐసీసీ పెద్దలు బుజ్జగించినా ఆయన వెనక్కి తగ్గలేదు. బుధవారం జగిత్యాలలో కార్యకర్తలతో సమావేశం అయ్యారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Jeevan Reddy Resignation | బాధతో పార్టీని వీడుతున్నా..

పార్టీ ఫిరాయింపులు మంచిది కాదని చెప్పినా వినిపించుకోలేదని జీవన్​ రెడ్డి (Jeevan Reddy) అన్నారు. జగిత్యాలలో ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకోవద్దని చెప్పినా వినలేదని పేర్కొన్నారు. తాను, తన కార్యకర్తలు అనేక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రమైన బాధతో పార్టీని వీడుతున్నాని ప్రకటించారు.

Jeevan Reddy Resignation | రేవంత్​రెడ్డిని ఎదిరించి పోరాటం చేస్తా

దానం నాగేందర్ (Danam Nagender) బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ, కాంగ్రెస్ గుర్తుపై ఎంపీగా పోటీ చేయడం దేనికి సంకేతమని జీవన్​రెడ్డి ప్రశ్నించారు. ఆయనను రాజీనామా చేయించి పోటీ చేయించాల్సిందని చెప్పారు. అందుకే సికింద్రాబాద్ ఎంపీ సీటును కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఓడిపోయిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలతో ఆయన సొంత పార్లమెంట్ మహబూబ్ నగర్‌లో పార్టీ ఓడిపోయిందన్నారు. తాను రేవంత్ రెడ్డిని ఎదిరించి పోరాటం చేస్తానని జీవన్​రెడ్డి అన్నారు. ఆయనతో అణగదొక్కించుకోవడం కంటే పోరాటం చేస్తే తనకు పోయేది ఏమి లేదన్నారు.

Jeevan Reddy Resignation | వారికే పదవులు

సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అడుగులకు మడుగులు ఒత్తే వారికి పదవులు ఇస్తున్నారని జీవన్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిని పక్కన పెడుతున్నారన్నారు. వేం నరేందర్ రెడ్డి ఎవడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ ఏమిటని ప్రశ్నించారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అని నిలదీశారు. బతకడానికి వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రభుత్వ సలహాదారుడిగా నియామకం అయిన తర్వాత ఇచ్చిన సలహాలు ఏమైనా ఉన్నాయా అని ఎద్దేవా చేశారు.

Jeevan Reddy Resignation | ఎంతమందిని తొక్కుతావు

తనకు ఎవరైనా అడ్డం వస్తే తొక్కుతా అని రేవంత్ రెడ్డి అంటున్నారని జీవన్​రెడ్డి అన్నారు. ఎంతమందిని తొక్కుతారని ప్రశ్నించారు. జగిత్యాలలో ఏ శక్తి తనను ఆపలేదన్నారు. కొంతమంది లాగా ముఖ్యమంత్రి అయ్యేందుకు తాను కాంగ్రెస్ పార్టీలోకి రాలేదన్నారు. రేవంత్​రెడ్డి తమను కూడా బతకనివ్వాలన్నారు. విధి లేని పరిస్థితుల్లో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తాను రోడ్డు ఎక్కితే ఎవ్వరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..: Sircilla Weavers Dues | నేత కార్మికుల విద్యుత్​ బకాయిలు రద్దు చేయాలి : కేటీఆర్​

SI Suspension | మిల్స్​కాలనీ ఎస్సై సస్పెన్షన్​
Maize Procurement Centers | మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి : హరీశ్​రావు
Kaleshwaram Package Works | కాళేశ్వరం​ ప్యాకేజీ పనులను పూర్తి చేయాలి: ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి
Stock Market Volatility | ప్రారంభ లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
Ali Khamenei Death | ఖమేనీ మరణం.. ఇరాన్​లో 40 రోజులు సంతాప దినాలు.. వారం రోజులు సెలవులు!
TAGGED:CM Revanth ReddyCongress PartyDanam NagenderJagtial MLA Sanjay KumarJeevan ReddyJeevan Reddy Resignation
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article MLA Disqualification Case MLA Disqualification Case | అనర్హత కేసు.. ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
Next Article Iran Currency Collapse Iran Currency Collapse | ఏడున్నర డాలర్లుంటే.. అక్కడ కోటీశ్వరులే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?