Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Jeevan Reddy Resignation | అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేను : జీవన్‌రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Jeevan Reddy Resignation | అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేను : జీవన్‌రెడ్డి

తెలంగాణ

Jeevan Reddy Resignation | అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేను : జీవన్‌రెడ్డి

కాంగ్రెస్​కు రాజీనామాపై మాజీ మంత్రి జీవన్​రెడ్డి లేఖ విడుదల చేశారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని పేర్కొన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 22, 2026 6:28 సా.
Srinivas Kolluri
5 రోజులు ago
Share
Jeevan Reddy Resignation

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jeevan Reddy Resignation | మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు జీవన్​రెడ్డి (Jeevan Reddy) పార్టీకి రాజీనామా చేస్తానని మరోసారి స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా ఆయన పార్టీ వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఆయన సైతం పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మంత్రులు శ్రీధర్​బాబు (Sridhar Babu), అడ్లూరి లక్ష్మణ్​కుమార్​ శనివారం జీవన్​రెడ్డితో చర్చించారు. పార్టీ మారొద్దని కోరారు.

Contents
  • Jeevan Reddy Resignation | అనుచరులతో చర్చించి..
    • Jeevan Reddy Resignation | వందసార్లు చెప్పినట్లు…

మంత్రులు బుజ్జగించినా.. జీవన్​రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ మేరకు ఆదివారం ఆయన లేఖ విడుదల చేశారు. పార్టీని వీడడానికి గల కారణాలను అందులో పేర్కొన్నారు. అవమానాలు భరిస్తూ పార్టీలో కొనసాగలేనని తెలిపారు. ఈ నెల 25న కాంగ్రెస్‌ (Congress)కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదే రోజు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు.

Jeevan Reddy Resignation | అనుచరులతో చర్చించి..

కాంగ్రెస్​లో 20 నెలలుగా జరుగుతున్న పరిణామాలను బట్టి పార్టీ మారుతున్నట్లు లేఖలో జీవన్​రెడ్డి తెలిపారు. అవమానాలకు గురి అవుతూ, మానసిక క్షోభతో పార్టీలో కొనసాగలేనన్నారు. ఈ నెల 25న జగిత్యాల (Jagtial) పట్టణంలోని ఉదయం 10 గంటలకు నాయకులు, అనుచరులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో అనుచరులతో చర్చించి ఏ పార్టీలో చేరేది తెలుపనున్నారు. అయితే ఆయన బీఆర్​ఎస్​లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

Jeevan Reddy Resignation | వందసార్లు చెప్పినట్లు…

రాజీనామాపై ప్రచారాలు, కాంగ్రెస్​ మంత్రుల బుజ్జగింపుల నేపథ్యంలో ఆయన ఇంటి ఎదుట పోస్టర్లు వెలిశాయి. ‘‘నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్లే” అని జీవన్​రెడ్డితో ఉన్న పోస్టర్లను ఆయన అనుచరులు అతికించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే పోస్టర్లు వెలవడం గమనార్హం. అందులో తెలంగాణ పొలిటికల్ సూపర్ స్టార్ జీవన్​రెడ్డి అని రాశారు.

 

దీనిని కూడా చదవండి : Rythu Bharosa Funds | అన్నదాతలకు గుడ్​న్యూస్​.. రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి..

Rajya Sabha Nomination | రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్‌ సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్‌
Prajapalana Pragathi Pranalika | ప్రగతి ప్రణాళికలో అందరినీ భాగస్వామ్యులను చేయాలి
Bandi Sanjay Kondagattu Yatra | కొండగట్టు అభివృద్ధి బాధ్యత తీసుకుంటా : బండి సంజయ్​
BRS Leaders Arrest | బీఆర్ఎస్, బీఆర్​ఎస్​వీ నాయకుల ముందస్తు అరెస్ట్
Women Health Tests | మహిళలకు 30 రకాల వైద్య పరీక్షలు : మంత్రి రాజనర్సింహ
TAGGED:Congress PartyIndian Politics NewsJeevan ReddyPolitical ResignationTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Rythu Bharosa Funds Rythu Bharosa Funds | అన్నదాతలకు గుడ్​న్యూస్​.. రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి..
Next Article Telangana minorities issue | Telangana minorities issue | మైనారిటీలకు మొండిచేయి చూపించిన తెలంగాణ సర్కార్..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?