Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Jeevan Reddy Resignation | కాంగ్రెస్​కు రాజీనామా చేయనున్న జీవన్​రెడ్డి.. ఏ పార్టీలో చేరుతారో?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Jeevan Reddy Resignation | కాంగ్రెస్​కు రాజీనామా చేయనున్న జీవన్​రెడ్డి.. ఏ పార్టీలో చేరుతారో?

తెలంగాణతాజా వార్తలు

Jeevan Reddy Resignation | కాంగ్రెస్​కు రాజీనామా చేయనున్న జీవన్​రెడ్డి.. ఏ పార్టీలో చేరుతారో?

కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు, మాజీ మంత్రి జీవన్​రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఆయన బీఆర్​ఎస్​లో చేరనున్నట్లు సమాచారం.

Srinivas kolluri
Last updated: మార్చి 16, 2026 1:22 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Jeevan Reddy Resignation

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jeevan Reddy Resignation | కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు, మాజీ మంత్రి జీవన్​రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. త్వరలో పార్టీని వీడనున్నట్లు ఆయన ప్రకటించారు. ఉగాది, రంజాన్​ అనంతరం తన అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.

Contents
  • Jeevan Reddy Resignation | సంజయ్​ రాకతో..
    • Jeevan Reddy Resignation | మున్సిపల్ ఎన్నికల్లో..
      • Jeevan Reddy Resignation | గులాబీ గూటికి?

కాంగ్రెస్​లో జీవన్​రెడ్డి సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నారు. ఆయన 1983లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి గెలిచి ఎన్టీఆర్​ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 1985లో ఆయన కాంగ్రెస్​లో చేరారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన జీవన్​రెడ్డి 1989లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మొత్తం ఆరుసార్లు జగిత్యాల (Jagtial) నుంచి విజయం సాధించారు. ఎన్టీఆర్​, నాదెండ్ల భాస్కర్​రావు, వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి మంత్రివర్గాల్లో పని చేశారు.

Jeevan Reddy Resignation | సంజయ్​ రాకతో..

సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్​ (Congress)కు సేవలు అందించిన జీవన్​రెడ్డి కొంతకాలంగా ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారు. బీఆర్​ఎస్​ (BRS) అధికారంలో ఉన్న సమయంలో సైతం పార్టీని అట్టిపెట్టుకొని ఉన్న ఆయన కాంగ్రెస్​ గెలిచాక.. వీడాలని నిర్ణయించుకోవడం గమనార్హం. జగిత్యాల ఎమ్మెల్యేగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ నుంచి పోటీ చేసిన సంజయ్​ విజయం సాధించారు. జీవన్​రెడ్డి ఓటమి పాలు అయ్యారు. అనంతరం సంజయ్​ కాంగ్రెస్​లో చేరడంతో జీవన్​రెడ్డికి ప్రాధాన్యత తగ్గింది. రెండు వర్గాల మధ్య కొంతకాలంగా పొసగడం లేదు. ఎమ్మెల్యే సంజయ్​ (MLA Sanjay)పై జీవన్​రెడ్డి గతంలో అనేకసార్లు బహిరంగంగా విమర్శలు చేశారు. అయితే పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో జీవన్​రెడ్డి పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు.

Jeevan Reddy Resignation | మున్సిపల్ ఎన్నికల్లో..

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) జీవన్​రెడ్డికి పార్టీలో అవమానం జరిగింది. ఆయన అనుచరులకు టికెట్లు ఇవ్వలేదు. ఎమ్మెల్యే అనుచరులు ఎక్కవ మంది బీఫామ్​లు ఇచ్చారు. దీంతో జీవన్​రెడ్డి తన అనుచరులను స్వతంత్రంగా బరిలో నిలిపి గెలిపించుకున్నారు. అనంతరం ఛైర్​పర్సన్​ పదవి విషయంలో సైతం జీవన్​రెడ్డికి కాంగ్రెస్​ మొండి చేయి చూపింది. దీంతో ఆయన రాజీనామాకు సిద్ధం అయ్యారు. ఏళ్లుగా పార్టీ సేవలు అందించానని, ప్రస్తుతం ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇమడలేకపోతున్నానని ఆదివారం ఆయన తెలిపారు.

Jeevan Reddy Resignation | గులాబీ గూటికి?

రంజాన్, ఉగాది పండుగల అనంతరం అభిమానులతో సమావేశమై ఏ పార్టీలోకి వెళ్లాలో నిర్ణయం తీసుకుంటానని జీవన్​రెడ్డి తెలిపారు. అయితే ఆయన బీఆర్​ఎస్​లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 27న కేసీఆర్​ సమక్షంలో జీవన్​ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. బీఆర్​ఎస్​లో ఆయనకు సముచిత గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. తాజాగా ఆయన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి కాంగ్రెస్ పేరును సైతం తొలగించారు.

ఇది కూడా చదవండి..: KTR Assembly Attack | శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం : కేటీఆర్​

Vijay Rashmika Reception | ఘనంగా విరోష్​ రిసిప్షన్​ వేడుక.. హాజరైన ప్రముఖులు..
Babli Water Release | బాబ్లీ ప్రాజెక్ట్​ గేట్ల ఎత్తివేత
March 06 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు
Bansilalpet Stepwell Events | వారాంతపు సాంస్కృతిక వేదిక.. బన్సీలాల్‌పేట స్టెప్‌వెల్
Telangana Hailstorm Rain | పలు​ జిల్లాల్లో వడగళ్ల వాన.. ఆందోళనలో రైతులు
TAGGED:BRSCongressJagtialJeevan Reddy ResignationMLA SanjayMunicipal Elections
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Denza Z9 GT Denza Z9 GT | ఐదు నిమిషాల్లో 70 శాతం చార్జింగ్.. అదుర్స్ అనిపించే ఫీచర్లతో బీవైడీ ఈవీ కారు
Next Article BMW Car Accident BMW Car Accident | బీఎండబ్ల్యూ కారు బీభత్సం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?