అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jeevan Reddy Sanjay Clash | జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ (MLA Sanjay)పై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే ఆఫర్ ఇచ్చారన్నారు. అసలు సంజయ్ ఏ పార్టీలో ఉన్నారని ఆయన ప్రశ్నించారు.
సంజయ్ బీఆర్ఎస్‌లో ఉన్నారని స్పీకర్ అంటున్నారని,కాంగ్రెస్‌లో కలిసి పనిచేయాలని ఆయన అంటున్నారని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. తనకు ఆఫర్ ఇవ్వడానికి ఆయన ఎవరని ప్రశ్నించారు. తాను పార్టీ వీడతానని ఆయనకు చెప్పానా అన్నారు. పార్టీ వీడాలనే ఆలోచన రావడానికి కారణం సంజయ్ కాదా అన్నారు. తమ పార్టీలోకి వచ్చి చిచ్చు పెట్టింది సంజయ్ అని విమర్శించారు.
Jeevan Reddy Sanjay Clash | నిర్ణయం తీసుకుంటా..
జగిత్యాల (Jagtial) కాంగ్రెస్‌లో కొంతకాలంగా విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మధ్య పొసగడం లేదు. పార్టీ అధిష్టానం జీవన్‌రెడ్డిని పక్కన పెట్టి, బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన సంజయ్‌కు ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో పలుమార్లు బహిరంగంగానే విమర్శించారు. అయినా పార్టీ పెద్దలు ఆయన మాటలు పట్టించుకోలేదు. దీంతో కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సంజయ్ మాట్లాడుతూ.. తనతో కలిసి పనిచేయాలని జీవన్‌రెడ్డిని కోరారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు గౌరవం లభించనప్పుడు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. దాని ప్రభావం ఎలా ఉంటుందో కాలం నిర్ణయిస్తుందన్నారు.
Jeevan Reddy Sanjay Clash | సంజయ్ రావడంతోనే..
తనకు కాంగ్రెస్‌తో 4 దశాబ్దాల అనుబంధం ఉందని జీవన్‌రెడ్డి తెలిపారు. ఎంత ఒత్తిడి ఉంటే పార్టీ మారాలని నిర్ణయం తీసుకుంటానో ఆలోచించాలన్నారు. సంజయ్ కాంగ్రెస్‌లోకి రావడంతోనే పార్టీలో చిచ్చు రేగిందని ఆరోపించారు. కాగా జీవన్‌రెడ్డి త్వరలో బీఆర్ఎస్ (BRS)లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన ఇంటి వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీలను అనుచరులు తొలగించారు. ఉగాది, రంజాన్ తర్వాత అనుచరులతో చర్చించి పార్టీ మార్పుపై ప్రకటన చేస్తానని జీవన్‌రెడ్డి తెలిపారు.
దీనిని కూడా చదవండి : HYDRAA Land Protection | 11 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా

