అక్షరటుడే, వెబ్డెస్క్: Jeevan Reddy Targets Revanth Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా.. ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. దీంతో రాష్ట్రంలో ‘మార్పు రావాలి.. రేవంత్ రెడ్డి పోవాలి అనే నినాదం వచ్చింది’ అని వ్యాఖ్యానించారు. కేవలం రేండేళ్ల కాలంలోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. ఆయన శుక్రవారం జగిత్యాలలో విలేకరులతో మాట్లాడారు.
Jeevan Reddy Targets Revanth Reddy | రేవంత్ నిర్లక్ష్యపు పాలనకు అద్దం
ఎన్నికల్లో హామీలు నెరవేర్చలేకపోయామని.. ఇది రేవంత్ నిర్లక్ష్యపు పాలనకు అద్దం పడుతోందని జీవన్ రెడ్డి విమర్శించారు. త్వరలోనే పార్టీ మారుతానని తెలిపారు. రెండు వారాల్లోపు అన్ని బయటకు వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్వహణలో విఫలమయ్యారన్నారు. యావత్ తెలంగాణకు జీవనాధారమైన ప్రాణహిత ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించకపోవడం సరికాదన్నారు. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ అయ్యిందని జీవన్ రెడ్డి అన్నారు. దానికి మరమ్మతులు చేయడం లేదన్నారు. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ ఏ విధం ఉండబోతుందో ఎవరూ ఉహించలేని పరిస్థితి ఉందన్నారు.
Jeevan Reddy Targets Revanth Reddy | కార్యకర్తల ఆలోచన మేరకే..
కార్యకర్తల అభిప్రాయం మేరకు ముందుకు సాగుతానని జీవన్ రెడ్డి తెలిపారు. వారం నుంచి రెండు వారాల్లో అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. ఉత్తర తెలంగాణలో రాజకీయంగా ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగిన వారితో తమతో నడవాలని పార్టీలు భావిస్తాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు అదే కోరుకుంటాయన్నారు. ప్రజలు మార్పు రావాలని కోరుకుంటున్నారని.. అది ఎవరితో సాధ్యమవుతుందో వారితో కలిసి నడుస్తామన్నారు. రేవంత్ రెడ్డి పాలన పోవాలంటే ఏ పార్టీతో సాధ్యమో అని ఆలోచన చేస్తున్నామన్నారు.
ఇది కూడా చదవండి..: Telangana Textile Hub | దక్షిణాసియా టెక్స్‌టైల్స్ రాజధానిగా తెలంగాణ.. ATEXCON సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి
