Jeffrey Epstein Documentary | సెక్స్ ట్రాఫికర్ జెఫ్రీ ఎప్‌స్టీన్.. కేవలం అమాయక బాలికలతో సెక్స్ ట్రేడింగ్ చేయడం ద్వారా రూ. 55 వేల కోట్లు సృష్టించిన అతి నీచమైన కీచకుడు.. డబ్బు, రాజకీయం, అధికారం కలయితో న్యాయం గొంతు నొక్కి కొన్నేళ్లపాటు ప్రపంచ సెక్స్ చీకటి సామ్రాజ్యాన్ని ఏలిన అతి కిరాతకుడు జెఫ్రీ ఎప్‌స్టీన్.
ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఈ కామాంధుడు.. బ్రిటన్ రాజు, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో లింకులు పెట్టుకునే స్థాయికి ఎదిగిన క్రమంలో ఎందరో అమాయక బాలికల మాంస ఖండాలు కరిగి ముద్దయ్యాయి. ఇతగాడి కామ సామ్రాజ్యం గురించి ఇప్పటికే 30 లక్షల పేజీలు బయటకు వచ్చాయట. ఇందులో ఎవరి పేరు ఎప్పుడు తెరపైకి వస్తుందో తెలియక ప్రపంచ కుభేరులు భయపడిపోతున్నారట. ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఇండియా ఏఐ సమ్మిట్ కి వచ్చినా.. ఎప్‌స్టీన్‌తో పరిచయం వల్ల ప్రవేశం దొరక్కపోవడంతో ఇంటి దారి పట్టారు.
Jeffrey Epstein Documentary |
జెఫ్రీ ఎప్‌స్టీన్ నీచమైన కామ చరిత్ర వెలుగు చూసినప్పుడే.. ఇతగాడి చీకటి నీచ బాగోతం కళ్లకు కట్టినట్లు చూపుతూ “Jeffrey Epstein: Filthy Rich” (జెఫ్రీ ఎప్‌స్టీన్- వికారపు సంపద) డాక్యుమెంటరీ సీరీస్ విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన ఈ సీరీస్‌లో జెఫ్రీ చీకటి కూపంలో ఓలలాడిన వేలాది మంది సుఖ పురుషుల రంకును ఇందులో చూపడం సంచలనం సృష్టిస్తోంది.
Jeffrey Epstein జీవిత చరిత్ర.. అధికారపు చట్రంలో విధానపరమైన నిర్ణేతల అక్రమాలు, అవినీతి, కామ చరిత్రతోపాటు వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనం. వ్యవస్థల వైకల్యానికి అధికారం రక్షణ కవచంగా మారిన తీరు ఈ కథనం. ఈ సీరీస్‌ను దర్శకురాలు Lisa Bryant తెరకెక్కించారు. డాక్యుమెంటరీలో అతి ముఖ్యమైనది బాధితుల ప్రత్యక్ష వాంగ్మూలాలు. Virginia Giuffre వంటివారు తమ కన్నీటి గాథలను నిస్సంకోశంగా కెమెరా ఎదుట చెప్పుకొన్నారు.
Jeffrey Epstein Documentary | ఎవరీ జెఫ్రీ ఎప్‌స్టీన్..
యూదు మూలాలున్న వ్యక్తి జెఫ్రీ ఎప్‌స్టీన్. చాలా సాదారణమైన కుటుంబం నుంచి వచ్చాడు. తండ్రి చిన్న వ్యాపారం, తల్లి ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేసేవారు. జెఫ్రీ ఎప్‌స్టీన్అవతలి వారిని బురిడీ కొట్టించడంలో ఘనుడు. కనీసం డిగ్రీ కూడా చదవని ఇతగాడు సైంటిస్ట్ గానూ చెలామణి అయ్యాడు. నకిలీ స్టాక్ బ్రోకర్‌నూ అయ్యాడు. అధికార వర్గాలతోపాటు అనధికార వర్గాల కామ అవసరాలు తీర్చేందుకు నగ్నావతారం ఎత్తాడు. అలా ప్రపంచ కుభేరులను తన గుప్పిట్లో పెట్టుకుని రెండు ప్రైవేటు విమానాలు సంపాదించాడు. సకల విలాసాల సౌకర్యాలతో రెండు ద్వీపాలు (ఐలాండ్స్) ఆక్యుపై చేశాడు. ఫ్లోరిడా తీరంలో ఇతగాడి రాజసౌధాలు వెలిశాయంటే అతిశయోక్తి కాదు. అందులో గోడల్లోనే బిగించిన నిఘా నేత్రాలు, చీమ చిటుక్కుమన్నా పసిగట్టే గూఢచారులు.. ఇలా ఎన్నో విలాసవంతమైన ప్రపంచాన్ని సొంతం చేసుకున్నాడు. ఇందుకు అతగాడు చేసిన పని ఏమిటంటే.. వందలాది మంది అభం శుభం తెలియని ఆడపిల్లల శరీరాలను మాంసపు ముద్దలుగా మార్చి తార్చడం.
Jeffrey Epstein Documentary | నాలుగు ఎపిసోడ్లు..
Jeffrey Epstein: Filthy Rich- సీరీస్‌లో నాలుగు ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతీది దాదాపు 55-57 నిమిషాల నిడివితో ఉంటుంది. మొదటిది 1996 నుంచి మొదలవుతుంది. దీంట్లో అమాయక ఆడ పిల్లలకు ఎప్‌స్టీన్ ఎలా వల వేస్తాడో చూపించారు. తన ప్రేయసితో కలిసి బాలికలను ఎలా ట్రాప్ చేసేవాడో ఇందులో చిత్రీకరించారు. ఇక తర్వాత “పిరమిడ్ స్కీమ్” మొదలవుతుంది. అంటే గొలుసుకట్టు రిక్రూట్మెంట్. ఒకరు ఇంకొకర్ని.. వాళ్లు ఇంకొందరిని తీసుకురావడం.
Jeffrey Epstein Documentary | మిగతా ఎపిసోడ్స్‌లో..
రెండో ఎపిసోడ్లో ఎప్‌స్టీన్ కి సంపద, పరపతి ఎలా వచ్చిందనేది చూపారు. ఆ సంపదను ఎలా రక్షణ కవచంగా మార్చుకున్నాడనేది వివరించారు. ఇక మూడో ఎపిసోడ్లో ఎప్‌స్టీన్ రెండు ద్వీపాలను ఎలా సంపాదించాడు..? వాటిలో జరిగే నీచకమైన కార్యకలాపాలు ఏమిటనేది చూపారు.
ఇక నాలుగో ఎపిసోడ్ లో బాధితుల న్యాయ పోరాటం, 2019లో మియామి హెరాల్డ్ జర్నలిస్ట్ ఇన్వెస్టిగేషన్.. ఎప్‌స్టీన్ అరెస్టు.. న్యూయార్క్ జైల్లో అనుమానాస్పద కుక్క చావును వివరించారు. మధ్యలో అతగాడిని రక్షించేందుకు బడా న్యాయవాదులు పడే తపన కూడా చూపారు.

