Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Jharkhand Air Ambulance Crash | కూలిపోయిన ఎయిర్​ అంబులెన్స్​.. ఏడుగురు మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Jharkhand Air Ambulance Crash | కూలిపోయిన ఎయిర్​ అంబులెన్స్​.. ఏడుగురు మృతి

జాతీయంతాజా వార్తలు

Jharkhand Air Ambulance Crash | కూలిపోయిన ఎయిర్​ అంబులెన్స్​.. ఏడుగురు మృతి

ఝార్ఖండ్‌లో ఎయిర్ అంబులెన్స్ కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్లు, రోగి సహా ఏడుగురు మృతి చెందారు.

admin
Last updated: ఫిబ్రవరి 25, 2026 3:56 సా.
admin
1 నెల ago
Share
Jharkhand Air Ambulance Crash

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jharkhand Air Ambulance Crash | ఝార్ఖండ్‌లో ఎయిర్ అంబులెన్స్ కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్లు, రోగి సహా ఏడుగురు మృతి చెందారు. రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తుండగా చత్రా జిల్లాలో ప్రమాదం జరిగింది.

Contents
  • Jharkhand Air Ambulance Crash | ప్రతికూల వాతావరణంతో..
    • రుణం తీసుకొని..

జార్ఖండ్‌లోని చత్ర జిల్లాలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ అంబులెన్స్ (Jharkhand Air Ambulance Crash) కూలిపోయింది. అందులో ఉన్న ఏడుగురు మృతి చెందారు. సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రత్యామ్నాయ మార్గాన్ని కోరుతూ కమ్యూనికేషన్ మరియు రాడార్ సంబంధాన్ని కోల్పోయిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. విమానం రాంచీ నుంచి బయలుదేరింది. అనంతరం కొద్దిసేపటికే దానికి ఏటీసీతో సంబంధాలు తెగిపోపోయాయి. అడవి మధ్యలో విమానం కూలిపోయింది.

Jharkhand Air Ambulance Crash | ప్రతికూల వాతావరణంతో..

కష్టతరమైన భూభాగం సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగిందని సశస్త్ర సీమా బల్ (SSB) సెకండ్-ఇన్-కమాండ్ తెలిపారు. అడవిలో లోతుగా ఉన్న క్రాష్ సైట్‌కు రోడ్డు లేకపోవడంతో దాదాపు రెండు కిలోమీటర్ల దూరం మృతదేహాలను మోసుకెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. బృందం సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ఎవరూ సజీవంగా లేరని, వారి వద్ద ఒకే స్ట్రెచర్ ఉందని, ఆపరేషన్ మరింత సవాలుగా మారిందని ఆయన అన్నారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ప్రమాదం గురించి తమకు సమాచారం అందిందని, కఠినమైన భూభాగం రెస్క్యూ ఆపరేషన్‌ను మరింత సవాలుగా మార్చిందని చత్రా అధికారులు తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం కారణంగా విమానం కూలిపోయిందని మరో అధికారి తెలిపారు. విమానంలో ఉన్న వారిలో ఇద్దరు సిబ్బంది సభ్యులు కాగా, మిగిలిన ఐదుగురు రోగి, రోగి కుటుంబ సభ్యులు.

రుణం తీసుకొని..

రోగి సంజయ్, అతని బంధువులు లతేహర్ జిల్లాలోని చాంద్వా పట్టణ నివాసితులు. బాధితుల్లో ఆయన భార్య అర్చన, బంధువు ధ్రువ్, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు. సంజయ్ చాంద్వా పట్టణంలో ఒక హోటల్ నడిపాడు. సంజయ్ తన హోటల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు. బంధువుల నుంచి రూ.8 లక్షలు అప్పుగా తీసుకొని ఆ కుటుంబం ఎయిర్ అంబులెన్స్‌ను అద్దెకు తీసుకుంది. సంజయ్​ ప్రాణాలు కాపాడటానికి వారు ప్రయత్నించగా.. విధి అతడితో పాటు వారి ప్రాణాలను బలి తీసుకుంది.

ఇది కూడా చదవండి..: Chhattisgarh IED Blast | ఛత్తీస్‌గఢ్​లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లకు గాయాలు

LPG Booking Interval | గ్యాస్​ సిలిండర్ల బుకింగ్​పై కేంద్రం కీలక నిర్ణయం
Telangana Fund Rights | కేంద్రం నుంచి నిధులు దయ కాదు.. హక్కు : మంత్రి పొన్నం
Kavitha New Party | కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు..! మార్చి 27న ప్రకటించే ఛాన్స్​..
Fee Reimbursement Protest | ఫీజు రీయింబర్స్​మెంట్ విడుదల చేయాలని బీఆర్​ఎస్​ నిరసన
Unibrow Personality Myth | కనుబొమ్మల ఆకృతి ఇలా ఉందా.. అయితే తిరుగులేనట్టే!
TAGGED:Air Ambulance Accident IndiaChatra DistrictDGCA IndiaDirectorate General of Civil AviationJharkhand Air Ambulance CrashLatehar DistrictRanchi AirportSashastra Seema BalWeather Crash Incident
Share This Article
Facebook Whatsapp Whatsapp
Previous Article India Semi final Chances India Semi final Chances | జింబాబ్వే చిత్తుగా ఓడ‌డంతో ప్రమాదంలో టీమిండియా.. భారత్ సెమీస్ ఆశలు క్లిష్టం.. NRR కీలకం
Next Article Indian Stock Market Indian Stock Market | భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్లు.. ఐటీ స్టాక్స్‌ కుదేలు..
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?