అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jharkhand Bus Accident | జార్ఖండ్ Jharkhand రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడి ఐదుగురు దుర్మరణం చెందారు. సిమ్‌దేగా జిల్లా నుంచి ఛత్తీస్‌గఢ్‌కు ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఛత్తీస్‌గఢ్ Chhattisgarh – జార్ఖండ్ Jharkhand సరిహద్దు సమీపంలోని కర్దేగా లోయలో బస్సు ప్రమాదానికి గురైంది.
Jharkhand Bus Accident | బ్రేకులు ఫెయిల్ అయి..
అన్మోల్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సిమ్‌దేగా జిల్లా కుర్దేగ్ నుంచి ఛత్తీస్‌గఢ్ Chhattisgarh రాష్ట్రంలోని కుంకురికి వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. కుర్దేగ్ అవుట్‌పోస్ట్ ప్రాంతం గోడాంబా సమీపంలో దిగువకు దిగుతోంది.. సడెన్‌గా బ్రేకులు ఫెయిల్ కావడంతో బస్సు నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో సహాయకచర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంపై విచారణ చేపడుతున్నారు.

