Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Joint Tax Filing | దంపతుల కోసం జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ తేవాలి.. రాజ్యసభలో రాఘవ్ చద్దా!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Joint Tax Filing | దంపతుల కోసం జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ తేవాలి.. రాజ్యసభలో రాఘవ్ చద్దా!

జాతీయంతాజా వార్తలు

Joint Tax Filing | దంపతుల కోసం జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ తేవాలి.. రాజ్యసభలో రాఘవ్ చద్దా!

రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ Raghav Chadha ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగించే జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ విధానంపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.

Naresh chandan
Last updated: మార్చి 16, 2026 10:14 సా.
Naresh chandan
2 వారాలు ago
Share
Joint Tax Filing | దంపతుల కోసం జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ తేవాలి.. రాజ్యసభలో రాఘవ్ చద్దా!
Joint Tax Filing | దంపతుల కోసం జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ తేవాలి.. రాజ్యసభలో రాఘవ్ చద్దా!

అక్షరటుడే, న్యూఢిల్లీ: Joint Tax Filing : దేశంలో దంపతులపై పడుతున్న ఆదాయపు పన్ను భారం తగ్గించేందుకు జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ వ్యవస్థను తీసుకురావాలని రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్​ చద్దా Raghav Chadha కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం అమలులో ఉన్న పన్ను విధానం వల్ల ఒకే వ్యక్తి ఎక్కువ ఆదాయం సంపాదించే కుటుంబాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని రాఘవ్​ చద్దా పేర్కొన్నారు.

Contents
  • Joint Tax Filing : ఉదాహరణకు..
    • Joint Tax Filing : అభివృద్ధి చెందిన దేశాల్లో..

రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా చద్దా మాట్లాడారు. భార్యాభర్తలు ఇద్దరూ పనిచేసే కుటుంబాల్లో పన్ను లెక్కలు వేర్వేరుగా ఉండటంతో కొంత మేరకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు.

Joint Tax Filing : ఉదాహరణకు..

దంపతులు చెరో ₹10 లక్షలు సంపాదిస్తే వారి వ్యక్తిగత ఆదాయాలపై పన్ను భారం అంతగా ఉండకపోవచ్చు. కానీ, కుటుంబంలో ఒకరే ₹20 లక్షలు సంపాదిస్తే.. మాత్రం, ప్రస్తుతం ఉన్న పన్ను విధానం ప్రకారం సుమారు  ₹1.92 లక్షల వరకు పన్ను చెల్లించాల్సి వస్తోందని చద్దా వివరించారు. ఇది ఒకే కుటుంబ ఆదాయమే అయినప్పటికీ, పన్ను విధానంలో సమానత్వం లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోందని అభిప్రాయపడ్డారు.

జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ విధానం అమలు చేస్తే.. భార్యాభర్తల సంపాదనను ఒక కుటుంబ ఆదాయంగా పరిగణించి పన్ను లెక్కించవచ్చని చద్దా చెప్పుకొచ్చారు. ఈ విధానం అమలులోకి వస్తే ఒకరి ఆదాయం ఎక్కువ ఉన్నా.. మొత్తం కుటుంబ ఆదాయాన్ని లెక్కించడం వల్ల పన్ను భారం గణనీయంగా తగ్గుతుందని వెల్లడించారు.akshara raghav

Joint Tax Filing : అభివృద్ధి చెందిన దేశాల్లో..

కెనడా, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ వ్యవస్థ అమలులో ఉందని చద్దా గుర్తుచేశారు. ఆ దేశాల్లో దంపతులు సమష్టిగా ఆదాయపు పన్ను దాఖలు చేయడం వల్ల కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి తగ్గుతుందన్నారు. భారత్‌లోనూ ఇదే విధానం అమలు చేస్తే మధ్యతరగతి కుటుంబాలకు ఊరట లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

దంపతులలో ఒక్కరే ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించే సందర్భాల్లో ప్రస్తుతం ఉన్న పన్ను విధానం వల్ల ఆ కుటుంబంపై అధిక ఆర్థిక భారం పడుతోందన్నారు. జాయింట్ ఫైలింగ్ అమలుతో ఆ భారాన్ని తగ్గించడంతోపాటు కుటుంబ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం కల్పించవచ్చన్నారు.

Modi Political Statement | రాజకీయాల్లో ఫుల్​స్టాప్​ లేదు: ప్రధాని మోదీ
Nizamabad Student | ఏకలవ్య పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య
Telangana Power Demand | భారీగా పెరిగిన విద్యుత్​ వినియోగం
March 21 Gold Rates | పసిడి ధరలకు బ్రేక్… ఒక్కసారిగా భారీ పతనం, కొనుగోలుదారులకు ఊరట!
Why Air Invisible | మనకు గాలి ఎందుకు కనిపించదో తెలుసా.. దీని వెనుక ఉన్న రహస్యం ఇదే!
TAGGED:income tax for couplesindia tax policyindian taxation reformsjoint tax filingmarried couples tax benefitsmiddle class tax reliefraghav chadha proposalrajya sabha news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Floor Sitting Benefits | డైనింగ్ టేబుల్​పై మోజా.. నేలపై కూర్చొని తినడం నామోషీనా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే! Floor Sitting Benefits | డైనింగ్ టేబుల్​పై మోజా.. నేలపై కూర్చొని తినడం నామోషీనా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే!
Next Article Women Stomach Pain | మహిళల్లో కడుపు నొప్పి.. ఏ ప్రాంతంలో నొప్పి వస్తే ఏ అనారోగ్యానికి సంకేతమంటే..! Women Stomach Pain | మహిళల్లో కడుపు నొప్పి.. ఏ ప్రాంతంలో నొప్పి వస్తే ఏ అనారోగ్యానికి సంకేతమంటే..!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?