Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Jresta Villas RERA | కోకాపేటలోని జ్రెస్టా విల్లాస్​కు రెరా షాక్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Jresta Villas RERA | కోకాపేటలోని జ్రెస్టా విల్లాస్​కు రెరా షాక్​

తెలంగాణ

Jresta Villas RERA | కోకాపేటలోని జ్రెస్టా విల్లాస్​కు రెరా షాక్​

కోకాపేటలోని జ్రెస్టా విల్లాస్ ప్రాజెక్ట్ ప్రమోటర్లకు రెరా షాక్​ ఇచ్చింది. విల్లాలను అమ్మడం, బదిలీ చేయడంపై నిషేధం విధించింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 4, 2026 8:19 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Jresta Villas RERA

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jresta Villas RERA | రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG RERA) కోకాపేటలోని జ్రెస్టా విల్లాస్ ప్రాజెక్ట్ ప్రమోటర్లకు షాక్​ ఇచ్చింది. విల్లాలను అమ్మడం, బదిలీ చేయడంపై నిషేధం విధించింది.

రంగారెడ్డి (Rangareddy) జిల్లా గాంధీపేట మండలం, కోకాపేట (Kokapet) గ్రామంలోని సర్వే నెం. 84లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌లోని విల్లా కొనుగోలుదారులు దాఖలు చేసిన నాలుగు ఫిర్యాదులపై రెరా విచారణ జరిపింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భూ యజమానులు, ఒక ప్రైవేట్ డెవలపర్ సంస్థ కలిసి ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేశాయి. అయితే ఇది RERA కింద నమోదు కాలేదు. 6 ఎకరాల 14 గుంటల విస్తీర్ణంలో 42 విల్లాలతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. దీనికి హెచ్​ఎండీఏ (HMDA) అనుమతి తీసుకున్నారు. అయితే రెరా నుంచి పర్మిషన్​ తీసుకోలేదు. అయినా కూడా విల్లాలను మార్కెటింగ్​ చేయడం, అమ్మడంపై రెరా ఆగ్రహం వ్యక్తం చేసింది.

Jresta Villas RERA | నిర్మాణంలో జాప్యం..

ఈ విల్లాలు కొనడానికి 2016 నుంచి 2020 మధ్య ఒప్పందాలు కుదుర్చుకుని కొందరు ఒక్కో విల్లాకు రూ.3.44 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు చెల్లించారు. అయితే నిర్ణిత వ్యవధిలో విల్లాలు పూర్తి చేసి వారికి అప్పగించలేదని బాధితులు ఫిర్యాదు చేశారు. 2022 నాటికి ప్రాథమిక నిర్మాణ పనులు మాత్రమే పూర్తయ్యాయని, పాక్షికంగా పూర్తయిన విల్లాలను స్వాధీనం చేసుకోవలసి వచ్చిందని పేర్కొన్నారు. ప్రమోటర్లు ప్రాజెక్టును మధ్యలోనే వదిలేసి, సేకరించిన నిధులను మళ్లించారని ఆరోపించారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన రెరా మిగిలిన యూనిట్ల అమ్మకంపై నిషేధం విధించింది. విచారణను ఏప్రిల్ 8కి వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి : Encroachment Drive | ఫుట్​పాత్​లపై ఆక్రమణల తొలగింపు.. సికింద్రాబాద్​లో ఉద్రిక్తత

 

Bhu Bharati portal | ఒకే వేదికపై రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ సేవలు : మంత్రి పొంగులేటి
Bhadrachalam Kalyana Talambralu | భక్తుల ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు..
GHMC Elections BJP | జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి
Telangana Summer Heat | మండుతున్న ఎండలు.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
Telangana SSC Exams | పదో తరగతి పరీక్షలు రద్దు చేయ‌బోతున్నారా.. తెలంగాణ విద్యాశాఖ క్లారిటీ!
TAGGED:Hyderabad real estateJresta VillasKokapet newsproperty disputesRERA Telangana
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kamareddy Collector | Kamareddy Collector | కలెక్టర్ చొరవతో పాతికేళ్లకు ఇంటికి చేరిన వ్యక్తి
Next Article Trump Warns Iran Trump Warns Iran | హార్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు మరోసారి ట్రంప్ సీరియస్​ వార్నింగ్​..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?