Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Judicial Eleven victory | ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్​లో జ్యూడీషియల్ ఎలెవన్​ టీం ఘనవిజయం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Judicial Eleven victory | ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్​లో జ్యూడీషియల్ ఎలెవన్​ టీం ఘనవిజయం

నిజామాబాద్

Judicial Eleven victory | ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్​లో జ్యూడీషియల్ ఎలెవన్​ టీం ఘనవిజయం

సీపీ ఎలెవెన్​ టీం వర్సెస్ జ్యూడీషియల్ ఎలెవన్​ టీం జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్​లో జ్యూడీషియల్ టీం ఘన విజయం సాధించింది. జాన్కంపేట్​ వద్ద పోలీస్ శిక్షణ కేంద్రంలోని పరేడ్​ గ్రౌండ్​లో శనివారం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు.

Shashi kiran mottala
Last updated: ఫిబ్రవరి 28, 2026 9:06 సా.
Shashi kiran Mottala
4 వారాలు ago
Share
Judicial Eleven victory |
Judicial Eleven victory | ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్​లో జ్యూడీషియల్ ఎలెవన్​ టీం ఘనవిజయం

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Judicial Eleven victory | సీపీ ఎలెవెన్​ టీం వర్సెస్ జ్యూడీషియల్ ఎలెవన్​ టీం (Judicial Eleven victory) జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్​లో జ్యూడీషియల్ టీం ఘన విజయం సాధించింది. ఎడపల్లి పోలీస్ స్టేషన్ (Yedapalli Police Station) పరిధిలోని జాన్కంపేట్​ వద్ద పోలీస్ శిక్షణ కేంద్రం (CTC)లోని పరేడ్​ గ్రౌండ్​లో (Police training center CTC) శనివారం పోలీస్ టీం, జ్యూడీషియల్ టీంల (Police judicial sports event) మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు.

Contents
  • Judicial Eleven victory | టాస్​ గెలిచిన పోలీస్​ టీం..
    • Judicial Eleven victory | క్రీడలో ప్రతిఒక్కరి జీవితంలో ముఖ్యం..

Judicial Eleven victory | టాస్​ గెలిచిన పోలీస్​ టీం..

మొదట టాస్ గెలిచిన పోలీస్ టీం బ్యాటింగ్​ ఎంచుకుంది. నిర్ణీత 12 ఓవర్లలో పోలీస్ టీం 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. పోలీస్ టీంలో బ్యాటింగ్ చేసిన రిజర్వ్ ఇన్​స్పెక్టర్​ సతీష్ 59 పరుగులు చేసి నాటవుట్​గా నిలిచారు. సెకండ్ బ్యాటింగ్​కు దిగిన జ్యూడీషియల్ జట్టు నిర్ణీత 11.4 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఉదయ్​ కృష్ణ 3 ఓవర్లు వేసి ప్రతి ఓవర్​లో ఒక వికెట్ చొప్పున మూడు వికెట్లు తీశారు. దీంతో జ్యూడీషియల్​ జట్టు పోలీస్ జట్టుపై విజయం సాధించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి భరత లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు, రన్నరప్ టీంకు బహుమతులు ప్రదానం చేశారు.

Judicial Eleven victory | క్రీడలో ప్రతిఒక్కరి జీవితంలో ముఖ్యం..

అనంతరం జడ్జి మాట్లాడుతూ క్రీడలు మన జీవితంలో ఎంతో ముఖ్యమని న్యాయమూర్తి భరతలక్ష్మి (District judge Bharatha Lakshmi) అన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా అందిస్తాయని చెప్పారు. పోలీస్ శాఖ, న్యాయ విభాగం సభ్యులు అనునిత్యం ఎంతో బిజీగా విధుల్లో ఉంటూ తమ సమయం కేటాయించి క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి స్నేహపూర్వక మ్యాచ్‌లు మరిన్ని నిర్వహించాలని సూచించారు. కోర్టులో విధులు సక్రమంగా నిర్వహించే పోలీస్ సిబ్బందికి క్యాష్ రివార్డ్ జిల్లా జడ్జ్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో నిజామాబాద్(nizamabad) పోలీస్ కమిషనర్ సాయి చైతన్య(cp Sai Chaitanya), ఏడీజేలు హరీషా, దుర్గాప్రసాద్, కుష్బూ, శ్రీనివాస్, హరీష్, అదనపు డీసీపీ (అడ్మిన్) జి.బస్వారెడ్డి, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఆర్మూర్ ఏసీపీ వెంకట్ రెడ్డి, సీఐలు, రిజర్వ్ ఇన్​స్పెక్టర్లు, ఎస్సైలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రాజేశ్వర్, దయాకర్ గౌడ్, వసంత్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Kamareddy SI Retirement | ఇద్దరు ఎస్సైల పదవీ విరమణ

AICC Observer Appointment | ఏఐసీసీ పరిశీలకుడిగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నియామకం
Telangana Sports University | అన్ని సౌకర్యాలతో స్పోర్ట్స్​ యూనివర్సిటీ : సీఎం రేవంత్​రెడ్డి
National Science Day celebration | విద్యార్థులు సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి: కాంగ్రెస్ నేత రామర్తి గోపి
Nizamabad Budget Bias | బడ్జెట్​లో ఇందూరుపై కాంగ్రెస్​ సర్కారు వివక్ష: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
Kaleshwaram Package Works | కాళేశ్వరం​ ప్యాకేజీ పనులను పూర్తి చేయాలి: ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి
TAGGED:District judge Bharatha LakshmiFriendly cricket matchJudicial Eleven teamJudicial Eleven victoryNizamabad cricket matchPolice judicial sports eventPolice training center CTCTelangana sports newsYedapalli Police Station)
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Paddy storage warehouses | Paddy storage warehouses | ధాన్యం నిల్వకు గోడౌన్లను సిద్ధం చేయాలి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి
Next Article Qatar Iran Missile Qatar Iran Missile | ఖతార్​పై ఇరాన్​ క్షిపణి దాడి.. భయంతో ప్రజల పరుగులు
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?