అక్షరటుడే, ఎల్లారెడ్డి : Jukkal Drinking Water | జుక్కల్ నియోజకవర్గంలో వేసవిలో తాగునీటి సమస్య రాకుండా (jukkal drinking water)చూడాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (thota lakshmikantha rao mla) పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ (rws officials review) అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
Jukkal Drinking Water | పైప్లైన్ మరమ్మతులు..
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి సమస్యలు (summer water supply telangana) తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పైప్‌లైన్‌ల మరమ్మతులు, నిర్వహణ పనులను తక్షణమే పూర్తిచేసి నీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. మోటార్ల సమస్యలు వంటి చిన్నచిన్న లోపాలను కూడా వెంటనే గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో తాగునీటి సరఫరా సక్రమంగా జరుగుతుందో లేదో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
Jukkal Drinking Water | గృహ ప్రవేశానికి హాజరు..
జుక్కల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మాణమైన ఇందిరమ్మ (indiramma housing scheme) ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి జుక్కల్ (jukkal constituency news) ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరయ్యారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడం (Yellareddy local news) ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. జుక్కల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇల్లు ఇచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Hyderabad Traffic Restrictions | వాహనదారులకు అలెర్ట్.. రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు

