అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KA Paul Iran Israel War | యుద్ధంతో పశ్చిమాసియా రగిలిపోతుంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఇరాన్ అట్టుడుకుతోంది. ఇరాన్ ప్రతిదాడులతో గల్ఫ్ దేశాల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు యుద్ధంతో చమురు, గ్యాస్ రవాణాపై ప్రభావం పడింది.
దీంతో పలు దేశాల్లో చమురు సంక్షోభం తలెత్తింది. ప్రపంచం మొత్తం యుద్ధం ఎప్పుడు ముగుస్తుందోనని ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ (KA Paul) కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వారం రోజుల్లో ముగుస్తుందని కేఏ పాల్ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్నది ప్రపంచ యుద్ధం అని ఆయన పేర్కొన్నారు. రష్యా, చైనా, నార్త్ కొరియా కలిసి అమెరికా (America)పై అణుబాంబు వేయడానికి ప్లాన్ చేసిన వార్‌గా ఆయన అభిప్రాయ పడ్డారు.
KA Paul Iran Israel War | ఈగోతో ప్రారంభం
ఈ యుద్ధం ఈగోతో ప్రారంభం అయిందని కేఏ పాల్ అన్నారు. దీనిని ఆపేందుకు ఇప్పటికే తాను అనేక మంది నేతలను కలిసినట్లు చెప్పారు. ఇటీవల ఆయన ఇరాన్లో పర్యాటించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump)తోపాటు ఇరాన్ నాయకులు సైతం యుద్ధం ఆపేందుకు సిద్ధంగా ఉన్నారని ట్రంప్ ప్రకటించారు. వారం రోజుల్లో, అంతకంటే ముందే యుద్ధం ముగుస్తుందని చెప్పారు.
ఇది కూడా చదవండి..: Shiv Pratap Shukla Governor | గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణం

