అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KA Paul War Statement | అమెరికా యుద్ధాన్ని వెంటనే ఆపేయాలని కేఏ పాల్ (KA Paul) డిమాండ్ చేశారు. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోందన్నారు. గ్యాస్ కొరతతో ఇండియా ఇబ్బంది పడుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు.
ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ఇరాన్– ఇజ్రాయెల్ (Iran–Israel), అమెరికా మధ్య యుద్ధం ఆపాలని కోరుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే పలు దేశాల నేతలతో చర్చలు జరిపారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం వరకు యుద్ధం ముగుస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఆయన అమెరికా (America)లోని మియామిలో ఉన్నారు. యుద్ధం ఆపడానికి శాంతి చర్చల్లో తాను బిజీగా ఉన్నానని పేర్కొన్నారు.
KA Paul War Statement | యుద్ధం కోరుకోవడం లేదు
ఇజ్రాయెల్ ప్రజల్లో దాదాపు 80 శాతం మంది యుద్ధం కోరుకోవడం లేదన్నారు. గల్ఫ్‌లోని కొన్ని దేశాలు యూఏఈ, సౌదీ అరేబియాతోపాటు మరో రెండు దేశాల అధినేతలు ఇచ్చిన డబ్బులతో ఈ వార్ సాగుతోందని ఆరోపించారు. ఇది కేవలం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య సాగుతున్న యుద్ధం కాదన్నారు. శాంతి చర్చలకు ఇరాన్ అంగీకరించిందని చెప్పారు.
ఇది కూడా చదవండి..: Iran India Gas Support | మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య భారత్‌కు ఇరాన్ భరోసా.. హర్మూజ్ జలసంధి దాటిన గ్యాస్ ట్యాంకర్

