Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kabul Airstrike | కాబూల్‌లో వైమానిక దాడి.. 400 మంది దుర్మరణం అంటూ తాలిబన్ ఆరోపణ.. పాకిస్థాన్ ఖండన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Kabul Airstrike | కాబూల్‌లో వైమానిక దాడి.. 400 మంది దుర్మరణం అంటూ తాలిబన్ ఆరోపణ.. పాకిస్థాన్ ఖండన

అంతర్జాతీయంతాజా వార్తలు

Kabul Airstrike | కాబూల్‌లో వైమానిక దాడి.. 400 మంది దుర్మరణం అంటూ తాలిబన్ ఆరోపణ.. పాకిస్థాన్ ఖండన

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని డ్రగ్ డీ–అడిక్షన్ చికిత్సా కేంద్రంపై వైమానిక దాడి జరిగిందని తాలిబన్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ దాడిలో 400 మంది మృతి చెందగా మరో 200 మంది గాయపడినట్లు తెలిపింది. అయితే ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకోలేదని పాకిస్థాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Naresh chandan
Last updated: మార్చి 17, 2026 9:27 ఉద.
Naresh chandan
1 వారం ago
Share
Kabul Airstrike | కాబూల్‌లో వైమానిక దాడి.. 400 మంది దుర్మరణం అంటూ తాలిబన్ ఆరోపణ.. పాకిస్థాన్ ఖండన
Kabul Airstrike | కాబూల్‌లో వైమానిక దాడి.. 400 మంది దుర్మరణం అంటూ తాలిబన్ ఆరోపణ.. పాకిస్థాన్ ఖండన

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kabul Airstrike | ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో Kabul ఘోర వైమానిక దాడి జరిగినట్టు సమాచారం వెలువడింది. కాబూల్‌లో ఉన్న మాదకద్రవ్యాల బానిసల చికిత్సా కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ వైమానిక దాడి నిర్వహించిందని తాలిబన్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ దాడిలో సుమారు 400 మంది మరణించగా మరో 200 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.

Contents
  • Kabul Airstrike | తోసిపుచ్చిన పాకిస్థాన్
    • Kabul Airstrike | క్రికెటర్ రషీద్ ఖాన్..

స్థానిక సమయం ప్రకారం సోమవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో కాబూల్ నగరాన్ని భారీ పేలుళ్లు కుదిపేశాయని స్థానిక మీడియా తెలిపింది. పేలుళ్లతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Kabul Airstrike | తోసిపుచ్చిన పాకిస్థాన్

ఆఫ్ఘనిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి షరఫత్ జమాన్ మాట్లాడుతూ డ్రగ్స్‌కు బానిసైన వారికి చికిత్స అందించే ఆసుపత్రి పూర్తిగా ధ్వంసమైందని చెప్పారు. అక్కడ ఉన్న భవనాలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయని, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఈ దాడిపై తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తీవ్రంగా స్పందించారు. ఆసుపత్రిపై Hospital దాడి చేయడం మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరమని ఆయన మండిపడ్డారు. అంతర్జాతీయ నిబంధనలను పాకిస్థాన్ ఉల్లంఘించిందని ఆరోపించారు. రంజాన్ ఉపవాస దీక్షలు ముగిసిన తర్వాత ప్రజలు బయట ఉన్న సమయంలో ఈ దాడులు జరగడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని ఆయన అన్నారు.

Kabul Airstrike | క్రికెటర్ రషీద్ ఖాన్..

ఇదిలా ఉండగా తాలిబన్ ఆరోపణలను పాకిస్థాన్ ప్రభుత్వం ఖండించింది. తాము ఎటువంటి ఆసుపత్రులను లేదా పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేసింది. కేవలం ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలపైనే దాడులు నిర్వహించామని పాక్ తెలిపింది.

ఆయుధ నిల్వ కేంద్రాలు మరియు సాంకేతిక పరికరాల కేంద్రాలపై మాత్రమే ఆపరేషన్ నిర్వహించామని వెల్లడించింది. తాలిబన్ ప్రతినిధులు చేస్తున్న ఆరోపణలు ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు చేస్తున్న తప్పుడు ప్రచారమని పాకిస్థాన్ సమాచార శాఖ కొట్టిపారేసింది.

ఈ ఘటనపై ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ rashid Khan కూడా స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. పౌర ప్రాంతాలు, విద్యా సంస్థలు లేదా ఆసుపత్రులపై దాడులు చేయడం యుద్ధ నేరమని ఆయన అన్నారు.

ముఖ్యంగా పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి దాడులు జరగడం చాలా బాధాకరమని, అసహ్యకరమని పేర్కొన్నారు. గత మూడు వారాలుగా పాకిస్థాన్–ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్‌లో దాడులు చేస్తున్న ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయం ఇస్తోందని పాక్ ఆరోపిస్తోంది.

Mojtaba Khamenei Iran | ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు
Kospi Market Crash | కుప్పకూలిన సౌత్ కొరియా స్టాక్ మార్కెట్
Telangana Pension Scheme | కొత్తగా రెండు లక్షల మందికి పింఛన్లు.. ఇంటర్​ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
Balkonda House Theft | తాళం పగలగొట్టి.. ఇంట్లోకి చొరబడి.. బాల్కొండలో చోరీ!
Fee Reimbursement Protest | ఫీజు రీయింబర్స్​మెంట్ విడుదల చేయాలని బీఆర్​ఎస్​ నిరసన
TAGGED:afghanistan newsglobal conflict newshospital airstrikeinternational newsKabul Airstrikepakistan afghanistan conflictrashid khan reactionTaliban Government
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article March 17 Gold Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెళ్లిళ్ల సీజన్ ముందు మధ్యతరగతికి కాస్త ఊరట March 17 Gold Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెళ్లిళ్ల సీజన్ ముందు మధ్యతరగతికి కాస్త ఊరట
Next Article Kabul Airstrike 400 Killed Kabul Airstrike 400 Killed | కాబూల్‌లో ఘోర వైమానిక దాడి.. 400 మంది మృతి అంటూ తాలిబన్ ఆరోపణలు, పాకిస్థాన్ ఖండన
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?