అక్షరటుడే, ఇందూరు: Kakatiya Nizamabad | ఇంటర్మీడియట్ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఇందులో కాకతీయ విద్యార్థులు సత్తా చాటారు. స్టేట్ ఫస్ట్, సెకండ్తో పాటు ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఇంటర్ సెకండియర్లో స్టేట్ ఫస్ట్, ఫోర్త్ ర్యాంకులు, ఫస్టియర్లో ఇద్దరు విద్యార్థులు స్టేట్ సెకండ్ ర్యాంకులు, నలుగురు స్టేట్ నాలుగో ర్యాంకులు పొందారు. ఈ సందర్భంగా కాకతీయ కళాశాల ప్రాంగణంలో సంబరాలు నిర్వహించారు. డీఈవో అశోక్ విద్యార్థులను సన్మానించారు.
Kakatiya Nizamabad | సెకండియర్లో..
సెకండియర్ ఎంపీసీలో మృదుల స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించగా, బైపీసీలో తుబా ఫాతిమా, బి.కావ్య నాలుగో ర్యాంకు సాధించారు. అంతేకాకుండా ఎంపీసీలో హమియా ఉమేమా, వై.గౌతమి ఆరో ర్యాంకు పొందారు. అలాగే డి.కౌచిత, ఏ.సంజన, సీహెచ్.వైష్ణవి, ఎన్.రూపాని, కె.కీర్తి, టి.నిత్యశ్రీ, కె.అశ్రిత స్టేట్ ర్యాంకులు సాధించారు.
Kakatiya Nizamabad | ఫస్టియర్లో..
ఫస్టియర్ ఎంపీసీలో బి.మనోగ్న, ఆర్.అక్షిత స్టేట్ సెకండ్ ర్యాంకులు పొందారు. అలాగే ఎస్.భవాని, సాకేత్, ఇష్రా మహీన్, జేఎస్.రినిత్య మూడో ర్యాంకులు సాధించారు. ఏ.సాయి విఘ్నత, తమన్నా నాజ్, సిరి వేద స్టేట్ ర్యాంకులు పొందారు.
ఈ సందర్భంగా కాకతీయ కళాశాల ప్రాంగణంలో సంబరాలు నిర్వహించారు. అనంతరం కాకతీయ విద్యాసంస్థల ఛైర్పర్సన్ సీహెచ్ విజయలక్ష్మి మాట్లాడుతూ అద్భుతమైన ఫలితాల వెనుక నిరంతర పర్యవేక్షణ ఉందన్నారు. విద్యార్థుల శ్రమ, తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల కృషి ఎంతగానో ఉందని పేర్కొన్నారు. 90 శాతం మంది విద్యార్థులు అత్యుత్తమ మార్కులు, స్టేట్ ర్యాంకులు సాధించారన్నారు.

రాష్ట్రంలో అగ్రగామిగా..
స్టేట్ ర్యాంకులే కాకుండా, అత్యుత్తమ ఉత్తీర్ణత శాతంతో కాకతీయ విద్యార్థులు రాష్ట్రంలో అగ్రగామిగా నిలవడం సంతోషంగా ఉందని విజయలక్ష్మి అన్నారు. అద్భుతమైన విజయాలకు కారకులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఉత్తమ ఫలితాలు వచ్చేందుకు విశేషమైన కృషి చేసిన అధ్యాపక బృందానికి, ప్రోత్సాహాన్ని అందించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్లు చెరుకూరి రజనీకాంత్, రామోజీ, తేజస్విని, రాజా, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Inter Results | నిజామాబాద్ జిల్లా ఇంటర్ ఫలితాల్లో బాలికల జోరు..
