అక్షరటుడే, వెబ్డెస్క్ : Kakinada Fireworks Explosion | కాకినాడ (Kakinada) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది.
వేట్లంపాడు, జి.మేడపాడు మధ్యలో ఉన్న బాణసంచా తయారీ పరిశ్రమలో పెద్ద ఎత్తున పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 20 మంది కార్మికులు సజీవ దహనం అయ్యారు. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో బ్లాస్ట్ అయింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 35 మంది కార్మికులు ఉన్నారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Kakinada Fireworks Explosion | 5 కి.మీ. మేర..
బాణసంచ తయారీ కేంద్రం (Kakinada Fireworks Explosion )లో మధ్యాహ్నం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ శబ్ధం 5 కిలోమీటర్ల వరకు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మంటలు అదుపులోకి రావడం లేదు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ 8 మందిని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో మహిళలే అధికంగా ఉన్నట్లు సమాచారం.
Kakinada Fireworks Explosion | సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
వేట్లపాలెం పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఆయన ఆరా తీశారు. వెంటనే ఘటనాస్థలికి వెళ్లాలని హోంమంత్రి అనితను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో హోంమంత్రి ఘటన స్థలానికి బయలు దేరారు. కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: AP Group 1 Case | గ్రూప్-1 అధికారులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
Several feared injured in blast at crackers unit in Andhra Pradesh-Kakinada.#Kakinada #fireaccident #AndhraPradesh#AndhraPradesh #fireaccident #Kakinada pic.twitter.com/hCyM4tTvkW
— Raja Sekhar (@Geetha_Ram2) February 28, 2026

